BRS Vs BJP: తగ్గేదేలే.. ఢిల్లీలో హై-వోల్టేజ్ రాజకీయం.. పోటాపోటీగా బీఆర్ఎస్, బీజేపీ నిరసనలు..

ఓవర్‌ టు ఢిల్లీ.! తెలంగాణ రాజకీయం ఢిల్లీకి షిఫ్ట్‌ అయింది.! నేడు పోటాపోటీగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నిరసనలకు సిద్ధమయ్యాయి.

BRS Vs BJP: తగ్గేదేలే.. ఢిల్లీలో హై-వోల్టేజ్ రాజకీయం.. పోటాపోటీగా బీఆర్ఎస్, బీజేపీ నిరసనలు..
Bjp Vs Brs
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 10, 2023 | 6:53 AM

ఓవర్‌ టు ఢిల్లీ.! తెలంగాణ రాజకీయం ఢిల్లీకి షిఫ్ట్‌ అయింది.! నేడు పోటాపోటీగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నిరసనలకు సిద్ధమయ్యాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత ఆధ్వర్యంలో జంతర్‌మంతర్ వద్ద భారీ నిరాహార దీక్ష జరగనుంది. అలాగే లిక్కర్ స్కామ్‌కు వ్యతిరేకంగా బీజేపీ ఢిల్లీ యూనిట్ ధర్నాకు రెడీ అయింది.

చట్టసభలల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఢిల్లీలో గళం వినిపించనున్నారు ఎమ్మెల్సీ కవిత. నేడు అనగా మార్చి 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ దీక్ష జరగనుంది. దీనిని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించనున్నారు. అలాగే కవిత చేపడుతోన్న దీక్షకు మొత్తం 18 పార్టీల ప్రతినిధులు వస్తున్నారు.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనే మహిళా రిజర్వేషన్ల దీక్ష చేపడుతున్నప్పటికీ ఈ కార్యక్రమం పూర్తిగా రాజకీయాలకు వేదికగా మారనుంది. ఇప్పటికే 18 పార్టీల ప్రతినిధులు వస్తుండగా…BRS నేతలు కూడా పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. సీతారం ఏచూరి, డి.రాజా వంటి కీలక నేతలు కూడా వస్తున్నారు. ఇక తెలంగాణ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ కూడా ధర్నాలో పాల్గొననున్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం జంతర్‌మంతర్‌లో కవిత నిరాహార దీక్ష.. అటు లిక్కర్‌స్కామ్‌కు వ్యతిరేకంగా దీన్‌దయాల్ మార్గ్‌లోని ఆంధ్ర స్కూల్ వద్ద బీజేపీ ఢిల్లీ యూనిట్ చేపడుతోన్న ధర్నాతో.. నేడు ఢిల్లీలో హై-వోల్టేజ్ పొలిటికల్ హీట్ ఖాయంగా కనిపిస్తోంది.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే