Bar license: బార్ల లైసెన్స్ ‘డ్రా’కు అనుమతిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం.. నేడు, రేపు లక్కీ డ్రా..
Telangana: తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 159 బార్లకు మార్గం సుగమం అయింది. బార్ రెస్టారెంట్ల డ్రా నిర్వహణకు రాష్ట్రంలో అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ ఆటంకం తొలగిపోయింది. తెలంగాణ ఎక్సైజ్‌శాఖ విజ్ఞప్తి..

Telangana: తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 159 బార్లకు మార్గం సుగమం అయింది. బార్ రెస్టారెంట్ల డ్రా నిర్వహణకు రాష్ట్రంలో అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ ఆటంకం తొలగిపోయింది. తెలంగాణ ఎక్సైజ్‌శాఖ విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలో బార్ల లైసెన్స్‌లకు గురు, శుక్రవారాల్లో (18, 19 తేదీలు) డ్రా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. కొత్త బార్లకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఈ నెల 16 వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే 159 బార్లకు 8464 దరఖాస్తులు వచ్చాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 55 బార్లకు ఎక్సైజ్ డైరెక్టర్ సమక్షంలో ఈ నెల 18న, జిల్లాల్లోని బార్లకు ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ నెల 19న లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ శాఖ ముందుగానే వెల్లడించింది.
ఈ క్రమంలో ఈ నెల 11న హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. కోడ్ అమల్లోకి రావడంతో బార్ల డ్రా నిర్వహణకు అనుమతించాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దీంతో బార్ల డ్రాకు అనుమతిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే దరఖాస్తుల నుంచి డ్రా తీసి దానిలో పేరు వచ్చినవారికి బార్లను కేటాయించనున్నారు.
Also Read: