Ramdas Athawale: రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోని.. గాంధీ కలను సాకారం చేయాలి: కేంద్ర మంత్రి అథవాలే
Rahul Gandhi: కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే.. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కులాంతర వివాహం చేసుకోవాలని..
Rahul Gandhi: కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే.. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కులాంతర వివాహం చేసుకోవాలని ఆయన సూచించారు. దళిత మహిళను వివాహం చేసుకోని.. మహాత్మా గాంధీ కలను సాకరం చేయాలంటూ రాహుల్‌కి అథవాలే సూచించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ ‘హమ్ దో.. హమారే దో‘ (మేమిద్దరం, మాకిద్దరు) అంటూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే జార్ఖండ్లోని రాంచీలో మీడియాతో మాట్లాడారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఆయన ఈ విధంగా పేర్కొన్నారు. మేం ఇద్దరం, మాకిద్దరు నినాదాన్ని గతంలో కుటుంబ నియంత్రణ కోసం ఉపయోగించేవారు. రాహుల్ గాంధీ ఇప్పుడు దీనికి ప్రాచుర్యం కల్పించాలనుకుంటే ముందు ఆయన పెళ్లి చేసుకోవాలి. అది కూడా ఓ దళిత అమ్మాయిని పెళ్లి చేసుకోని కులవివక్షను రూపుమాపాలి. మహాత్మా గాంధీ కన్న కలలను సాకారం చేయాలి.. ఇది యువతలోనూ స్ఫూర్తి నింపుతుంది అంటూ అథవాలే పేర్కొన్నారు. ఒకవేళ రాహుల్ దళిత మహిళను పెళ్లి చేసుకుంటే ప్రభుత్వ పథకం కింద ఆయనకు రెండున్నర లక్షలు ఆర్థిక సాయం అందజేస్తామంటూ వ్యాఖ్యానించారు.
Also Read: