Covid-19 vaccine: వారికి వ్యాక్సినేషన్ పూర్తయితే.. ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి కోవిడ్ వ్యాక్సిన్: ఎయిమ్స్‌ డైరెక్టర్

AIIMS Director Randeep Guleria: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే 90లక్షల మందికిపైగా వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయింది. ఈ క్రమంలో బహిరంగ మార్కెట్‌లో కరోనా..

Covid-19 vaccine: వారికి వ్యాక్సినేషన్ పూర్తయితే.. ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి కోవిడ్ వ్యాక్సిన్: ఎయిమ్స్‌ డైరెక్టర్
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 18, 2021 | 3:34 AM

AIIMS Director Randeep Guleria: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే 90లక్షల మందికిపైగా వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయింది. ఈ క్రమంలో బహిరంగ మార్కెట్‌లో కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందన్న విషయంపై.. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది చివరి నాటికి కోవిడ్‌ వ్యాక్సిన్లు ఓపెన్‌ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా వ్యాక్సిన్లు తీసుకోవాల్సిన వారందరికీ (ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 50ఏళ్లు పైబడిన వృద్ధులు) టీకాలు ఇవ్వడం పూర్తికావాలని ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండా డిమాండ్‌కు సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తే మాత్రమే.. బహిరంగ మార్కెట్లోకి వ్యాక్సిన్ వచ్చే అవకాశముందని గులేరియా తెలిపారు. బహుశా ఈ ఏడాది చివరి నాటికి లేదా అంతకంటే ముందే వ్యాక్సిన్ బహిరంగ మార్కెట్లోకి రావొచ్చంటూ గులేరియా అభిప్రాయపడ్డారు. దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించిన తొలి రోజు (జనవరి 16న) గులేరియా కోవిడ్ వ్యాక్సిన్‌‌ తొలి డోసును తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం రెండో డోసు తీసుకున్న అనంతరం మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్ భద్రమైనదేనని, మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుందని గులేరియా తెలిపారు. దీనిపై ఎలాంటి అపోహలు అవరసరం లేదని పేర్కొన్నారు.

Also Read:

Covid vaccine: కీలక నిర్ణయం తీసుకున్న భారత్.. శాంతి బలగాలకు బహుమతిగా 2 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు..

COVID Vaccine: భారత్ ఆపన్నహస్తం.. ఇప్పటివరకు 24 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా: నీతి ఆయోగ్