AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid vaccine: కీలక నిర్ణయం తీసుకున్న భారత్.. శాంతి బలగాలకు బహుమతిగా 2 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు..

S Jaishankar : కోవిడ్ వ్యాక్సిన్‌ డోసులను ఇప్పటికే పలు దేశాలకు సరఫరా చేసి అందరి మన్ననలు పొందుతున్న భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐక్యరాజ్యసమితి శాంతి బలగాలకు రెండు లక్షల..

Covid vaccine: కీలక నిర్ణయం తీసుకున్న భారత్.. శాంతి బలగాలకు బహుమతిగా 2 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు..
Shaik Madar Saheb
|

Updated on: Feb 17, 2021 | 11:59 PM

Share

S Jaishankar : కోవిడ్ వ్యాక్సిన్‌ డోసులను ఇప్పటికే పలు దేశాలకు సరఫరా చేసి అందరి మన్ననలు పొందుతున్న భారత్.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐక్యరాజ్యసమితి శాంతి బలగాలకు రెండు లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. యూఎన్ఓ, ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు జీఏవీఐ తదితర అంతర్జాతీయ సంస్థల శాంతి బలగాల సేవలను దృష్టిలో ఉంచుకుని భారత్ ఈ నిర్ణయం తీసుకుందని విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ తెలిపారు. ఈ మేరకు జై శంకర్.. బుధవారం జరిగిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో ఈ ప్రకటన చేశారు. సార్క్ కోవిడ్-19 ఎమర్సెన్సీ ఫండ్‌ కోసం భారత్ గట్టిగా మద్దతిచ్చిన విషయాన్ని కూడా జై శంకర్ గుర్తు చేశారు.

ప్రపంచ అవసరాలను తీర్చడానికి ఫార్మసీ రంగం మొత్తం ముందుకు వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో భారత్ పొరుగు దేశాలకు కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను అందిస్తూ తోడ్పాటునందిస్తుందని జైశంకర్ వివరించారు. భారత్ ఇప్పటికే 25 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్లు సరఫరా చేసిందని.. మరో 49 దేశాలకు కూడా వ్యాక్సిన్ పంపేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని.. వచ్చే ఆరు నెలల్లో 300 మిలియన్ల టీకాలు వేయనున్నట్లు జై శంకర్ తెలిపారు.

Also Read:

COVID Vaccine: భారత్ ఆపన్నహస్తం.. ఇప్పటివరకు 24 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా: నీతి ఆయోగ్

Serum Vaccines: ఇక పేద దేశాలకు కూడా సీరం కంపెనీ కోవిడ్ వ్యాక్సిన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీన్ సిగ్నల్.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!