Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID-19 Deaths: ఆ 18 రాష్ట్రాల్లో కరోనా మరణాల్లేవు.. మూడు రాష్ట్రాల్లోనే సగానికిపైగా మృతులు: కేంద్రం

Central government: దేశంలో రోజురోజుకూ కరోనా రికవరీ రేటు పెరుగుతోందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతోపాటు మరణాల రేటు తగ్గుతోందని వెల్లడించింది. ఉపశమనం కలిగించే..

COVID-19 Deaths: ఆ 18 రాష్ట్రాల్లో కరోనా మరణాల్లేవు.. మూడు రాష్ట్రాల్లోనే సగానికిపైగా మృతులు: కేంద్రం
Covid Deaths
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 18, 2021 | 1:50 AM

Central government: దేశంలో రోజురోజుకూ కరోనా రికవరీ రేటు పెరుగుతోందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతోపాటు మరణాల రేటు తగ్గుతోందని వెల్లడించింది. ఉపశమనం కలిగించే విషయమేమిటంటే.. 18 రాష్ట్రాల్లో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదని కేంద్రం వెల్లడించింది. వాటిలో కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయని తెలిపింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, పుదుచ్చేరి, హిమాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, మణిపూర్, లడఖ్, అస్సాం, అండమాన్ నికోబార్ దీవులు, సిక్కిం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డియులో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదని మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. దీంతోపాటు రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోందని పేర్కొంది. మంగళవారం మృతి చెందిన వంద మందిలో సగం మందికిపైగా మహారాష్ట్ర (39), కేరళ (18), తమిళనాడు(7) రాష్ట్రాలవారే ఉన్నారని వెల్లడించింది.

అయితే దేశంలో నిన్న 11,610 కరోనా కొత్త కేసులు నమోదు కాగా.. 100 మంది ఈ మహమ్మారితో మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.09 కోట్లు దాటగా.. 1.56 లక్షలకు చేరువైంది. ప్రస్తుతం దేశంలో 1.36 లక్షలే యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 1.06 కోట్లమంది కోలుకున్నారు.

Also Read: