Corona: కోవిడ్‌పై పోరులో భారత్.. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
PM Narendra Modi: కరోనా మహమ్మారిపై పోరులో భారతదేశం ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కోవిడ్ ప్రారంభంలో ఇతర దేశాలు దేశ పరిస్థితుల గురించి ఆందోళన చెందాయని..
PM Narendra Modi: కరోనా మహమ్మారిపై పోరులో భారతదేశం ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కోవిడ్ ప్రారంభంలో ఇతర దేశాలు దేశ పరిస్థితుల గురించి ఆందోళన చెందాయని.. కానీ మనమంతా సమిష్టి కృషితో ఎదుర్కొని ఆదర్శంగా నిలిచామని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ మంగళవారం జరిగిన శ్రీ రామ్‌చంద్ర మిషన్ వజ్రోత్సవాల్లో ప్రసంగించారు. భారత్.. పవిత్ర గ్రంధాల్లో ప్రవచించిన బోధనలకు అనుగుణంగా మానవత్వం పట్ల శ్రద్ధతో ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రస్తుతం కరోనా కట్టడిలో ప్రపంచ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. కరోనా వైరస్ అనంతరం ఆరోగ్య పరిరక్షణపై ప్రపంచం దృష్టిసారిస్తుందని వెల్లడించారు.
కరోనా లాక్‌డౌన్ నాటి నుంచి దేశంలో నియంత్రిత ఆరోగ్య సంరక్షణ, వైద్య మౌలిక సదుపాయాలపై విశేషంగా కృషి చేశామని తెలిపారు. భారత్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకమని ప్రధాని అభివర్ణించారు. గత ఆరేళ్ల నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా సంక్షేమ కార్యక్రమాలను భారత్ చేపట్టిందని.. పేదలకు ఆత్మగౌరవం, అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
Also Read: