Bandi Sanjay: నేనేం తప్పు చేయలేదు.. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ వివరణ
టీఎస్‌పీఎస్‌సీ రాజ్యాంగ బద్ధమైన సంస్థ అని, ఎలా రద్దు చేస్తామని కేటీఆర్ అంటున్నారు.. మరి ఈడీ, సీబీఐ బీజేపీకి చెందిన సంస్థలా..? అవి రాజ్యాంగ బద్ధ సంస్థలు కాదా..? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వివరణ ఇచ్చారు. ఈ మేరకు మహిళా కమిషన్ ఎదుట హాజరై.. సమాధానం చెప్పారు. రెండు గంటల 45 నిమిషాల పాటు విచారణ కొనసాగింది. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. మహిళా కమిషన్ అడిగిన దానికి వివరణ ఇచ్చానంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణలో ఒక సామెతను మాత్రమే వాడనని.. తాను ఏ తప్పు చేయలేదని తెలిపారు. మహిళా కమిషన్ రాజ్యాంగ బద్ధమైన సంస్థ.. తప్పు చేయలేదు కాబట్టే విచారణకు హాజరయ్యానంటూ పేర్కొన్నారు. వారు అడిగిన ప్రశ్నలకు అన్ని సమాధానాలు ఇచ్చానని.. తన స్టేట్ మెంట్స్ రికార్డు చేశారని తెలిపారు.
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై బండి సంజయ్ మాట్లాడుతూ.. బిజేపీ పాత్ర ఉందని అంటున్నారు.. ఎవరి హస్తం ఉందో అరెస్ట్ చేయాలంటూ సూచించారు. బ్యాక్ గ్రౌండ్ తెలుసుకుని ఉద్యోగాలు ఇస్తారు కదా.. TSTSలో రాజశేఖర్ ని ఎలా ఎంపిక చేశారంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. TSPSC బోర్డ్ ఎందుకు పనికిరాదంటూ విమర్శించారు. పరీక్ష రద్దు చేశారు.. పరీక్ష సరిగా నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
టీఎస్‌పీఎస్‌సీ రాజ్యాంగ బద్ధమైన సంస్థ అని, ఎలా రద్దు చేస్తామని కేటీఆర్ అంటున్నారు.. మరి ఈడీ, సీబీఐ బీజేపీకి చెందిన సంస్థలా..? అవి రాజ్యాంగ బద్ధ సంస్థలు కాదా..? అంటూ ప్రశ్నించారు. లీకేజీ నిందితురాలు రేణుక.. అమ్మ బీఆర్ఎస్ సర్పంచ్, వాళ్ళ అన్న బీఆర్ఎస్ లీడర్ అంటూ ఆరోపించారు. మరి కేసు ఎందుకు నిరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు. టీఎస్పీఎస్సిలో ఉన్న దొంగలను దొరకబట్టడం చేతకాలేదంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..