Bandi Sanjay: నీళ్లు ఫామ్‌ హౌజ్‌కు.. నిధులు కేసీఆర్ ఫ్యామిలీకి.. ఘాటుగా ట్విట్ చేసిన బండి సంజయ్

Bandi Sanjay on CM KCR: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మళ్లీ తనదైన శైలీలో కేసీఆర్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన తెలంగాణ ఉద్యమం

Bandi Sanjay: నీళ్లు ఫామ్‌ హౌజ్‌కు.. నిధులు కేసీఆర్ ఫ్యామిలీకి.. ఘాటుగా ట్విట్ చేసిన బండి సంజయ్
Bandi Sanjay
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 01, 2021 | 6:02 PM

Bandi Sanjay on CM KCR: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మళ్లీ తనదైన శైలీలో కేసీఆర్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన తెలంగాణ ఉద్యమం జరిగిందని గుర్తుచేశారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత అవన్నీ ఎటువెళ్లాయంటూ బండి సంజయ్ నిలదీశారు. తెలంగాణ వచ్చాక నీళ్లు ఫామ్‌హౌజ్‌కు, నిధులు సీఎం చంద్రశేఖర్ రావు అనుయాయులకు, నియామకాలు చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యులకే దక్కాయని సంజయ్ మండిపడ్డారు. తొలి, మలి దశ ఉద్యమానికి యువత ఊపిరిగా నిలిచారని బండి సంజయ్ పేర్కొన్నారు. యువకుందరూ ఉద్యోగాల కోసం ఎదురు చూశారని తెలిపారు. అలాంటి యువత తెలంగాణ ఏర్పడి అనంతరం ఏడేళ్లుగా ఉద్యోగం లేక, ఉపాధి లేక అల్లాడుతున్నారని.. ప్రస్తుతం వారి వయస్సు కూడా దాటి పోయిందని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యోమంలో అసువులు బాసిన 1200 మంది విద్యార్థి, యువకులు ఆత్మబలిదానాలకు.. అనంతరం ఉద్యోగాల కోసం జరిగిన ఆత్మ బలిదానాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ కల సాకారమై ఏడేళ్లవుతోందని.. లక్షలాది మంది యువతీ, యువకులు ఉద్యోగాల కోసం పడిగాపులు కాస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇప్పటికైనా న్యాయం చేయాలంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు. రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బండి సంజయ్ ఈ ట్విట్ చేశారు.

బండి సంజయ్ ట్విట్.. 

Also Read:

70 రాయల్ బెంగాల్ టైగర్లను చంపిన వేటగాడు హబీబ్ బంగ్లాదేశ్ లో అరెస్ట్.. …20 ఏళ్లుగా పోలీసుల ‘వేట’

CBSE Class 12 Board Exam 2021: సీబీఎస్ఈ పరీక్షలపై ప్రధాని మోడీ అధ్యక్షతన కీలక సమావేశం..పరీక్షలు రద్దు అవుతాయా?

అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?