AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రెచ్చిపోయిన బహదూర్‌పురా ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్.. జీహెచ్‌ఎంసీ అధికారులపై బూతుపురాణం!

బల్దియా అధికారులపై ఎంఐఎం ఎమ్మెల్యే ఓవరాక్షన్‌ చేశారు. రోడ్డు పనుల పెండింగ్‌ విషయంలో బహదూర్‌పురా ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్‌ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని దుర్భాషలాడారు. ఐతే తానూ అధికారులను తిట్టలేదని వివరణ ఇచ్చారు.

Hyderabad: రెచ్చిపోయిన బహదూర్‌పురా ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్.. జీహెచ్‌ఎంసీ అధికారులపై బూతుపురాణం!
Mla Mohammed Mubeen
Balaraju Goud
|

Updated on: Jun 27, 2024 | 10:38 AM

Share

బల్దియా అధికారులపై ఎంఐఎం ఎమ్మెల్యే ఓవరాక్షన్‌ చేశారు. రోడ్డు పనుల పెండింగ్‌ విషయంలో బహదూర్‌పురా ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్‌ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని దుర్భాషలాడారు. ఐతే తానూ అధికారులను తిట్టలేదని వివరణ ఇచ్చారు.

హైదరాబాద్‌ పాతబస్తీ మజ్లీస్ పార్టీకి చెందిన బహదూర్‌పురా ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ రెచ్చిపోయారు. ఓ ప్రార్థన మందిరం సమీపంలో రోడ్డు పనుల పెండింగ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై గరం గరం అయ్యారు. పెండింగ్ పనుల దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యే.. అక్కడి పరిస్థితిని సమీక్షించి.. జీహెచ్ఎంసీ సిబ్బందిపై బూతు పురాణంతో రెచ్చిపోయాడు. వెంటనే ప్రార్థన మందిరం సమీపంలోని రోడ్డు పనులను పూర్తి చేయకపోతే.. మీ సంగతి చూస్తానంటూ బల్దియా సిబ్బందిపై ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ దుర్భాషలాడారు. ఇంకా ఎన్నాళ్లు రోడ్డు పనులు చేస్తారంటూ ప్రశ్నించారు. తనతో పెట్టుకోవద్దు.. పనులు ఎంత వరకు జరిగాయో కూడా అధికారి వచ్చి చూసే తీరిక లేదా అంటూ జీహెచ్ఎంసీ సిబ్బందిని నిలదీశారు. తానెంత మంచివాడినో అంతే చెడ్డవాడిని అంటూ బల్దియా సిబ్బందిని MIM ఎమ్మెల్యే ముబీన్‌ హెచ్చరించారు.

బల్దియా అధికారులతో బహదూర్‌పురా MLA మహమ్మద్ ముబీన్ మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే తానూ GHMC అధికారులను దుర్భాషలాడలేదని, వారితో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. కేవలం పనుల్లో నిర్లక్ష్యంతోనే కాంట్రాక్టర్‌పై సీరియస్‌ అయ్యాయనని చెప్పారు. మొత్తానికి ఎంఐఎం ఎమ్మెల్యే ముబీన్‌ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..