Telangana: ఇదేం చిత్రం గురూ.. రోజూ ఆ పాఠశాలకు వచ్చి ధ్యానం చేస్తోన్న కొండముచ్చు
ఈ చిత్రం చూశారా..? ఆ కొండముచ్చు వారంలో 3 సార్లు ఠంచనుగా ఆ పాఠశాలకు వెళ్తుంది. ఆ పాఠశాల ఆవరణలోని.. సర్వసతి దేవి విగ్రహం వద్ద కూర్చుని ధ్యానంలో నిమగ్నమవుతుంది. దీంతో విద్యార్థులు, టీచర్స్.. ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఆ కొండముచ్చు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఓ కొండముచ్చు ప్రతిరోజు ఆ పాఠశాలకు వచ్చి ఆవరణలో ఉన్న సరస్వతి అమ్మవారి విగ్రహం ముందు ధ్యానం చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ కొండముచ్చు ఎవరిని ఏమనకుండా గంటపాటు సరస్వతి అమ్మవారి ముందు ధ్యానం చేసుకొని వచ్చిన దారినే వెళ్లిపోతుంది.. ఈ విచిత్ర సంఘటన అందర్నీ అయోమయానికి గురిచేస్తోంది.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఈ వింత సంఘటన జరిగింది.. ఓ కొండముచ్చు పాఠశాల ప్రాంగణంలోని సరస్వతి మాత విగ్రహం ముందు కూర్చుని ధ్యానం చేయడం ఆశ్చర్యంగా మారింది. వారంలో కనీసం మూడు రోజులు ఇలా కొండముచ్చు సరస్వతి అమ్మవారి విగ్రహం ముందుకు వచ్చి ధ్యానంలో నిమగ్నమవుతుంది.. ఆ కొండముచ్చును అక్కడున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరు డిస్టర్బ్ చేయడం లేదు.
ఒక మూగ జీవి దేవత విగ్రహం వద్ద ఇలా ధ్యానం చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.. ఈ వీడియోలు చిత్రీకరించిన పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సరస్వతి అమ్మవారి వద్ద కొండముచ్చు ధ్యానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి