AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ ఆస్పత్రికి కొండముచ్చే సెక్యూరిటీ గార్డ్..

గ్రామాల్లో విపరీతంగా పెరుగుతున్న కోతుల బెడదకు చెక్ పెట్టేందుకు జనం విభిన్నమైన ఆలోచనలు చేస్తున్నారు. కొండ ముచ్చును చూస్తే కోతులు భయంతో పరుగులు పెడతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీంతో వరంగల్ జిల్లాలోని ఓ ప్రవేట్ ఆస్పత్రి నిర్వాహకులు కొండముచ్చునే సెక్యూరిటీ గార్డ్‌గా పెట్టుకున్నారు.. కోతుల బెడద నుంచి ఇప్పుడు తమకు కాస్త ఉపశమనం ఉందని చెబుతున్నారు. 

Telangana: ఆ ఆస్పత్రికి కొండముచ్చే సెక్యూరిటీ గార్డ్..
Baboon In Cage
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: May 06, 2025 | 3:02 PM

Share

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో కోతుల బెడద విపరీతంగా పెరిగింది. వేలాది కోతులు ఇక్కడి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. వానర సేనల స్వైర విహారంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు.  కోతుల బెడద వల్ల స్కూళ్లు, ఆస్పత్రుల్లో కూడా ఇబ్బందులు తప్పడం లేదు. వాటి అల్లరి చేష్టలకు జనం బేజారైపోతున్నారు.. ఈ క్రమంలోని వర్ధన్నపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకులు ఓ చక్కటి ఆలోచన చేశారు. కోతుల బెడద నుంచి ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా కాపాడేందుకు కొండముచ్చును కొని తెచ్చారు.

వర్ధన్నపేటలోని వెంకటేశ్వర నర్సింగ్ హోమ్‌కు ప్రస్తుతం ఓ కొండముచ్చు పహారా కాస్తోంది. ఆసుపత్రికి వచ్చే వారిపై కోతులు పలుమార్లు దాడులకు దిగి రోగులకు తెచ్చే తినుబండారాలను ఎత్తుకెళ్లిపోవడం గమనించిన ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ రాజ నరేందర్ రెడ్డి.. 30,000 వెచ్చించి ఏపీ నుండి ఓ కొండముచ్చును ఆసుపత్రి కాపలా కోసం తెచ్చారు. దీంతో ఆసుపత్రి చుట్టుపక్కల కోతుల సంచారం లేకుండా పోయింది. కొండముచ్చు రాకతో ఆ ప్రాంతం కోతుల బెడద నుంచి ఉపశమనం లభించింది.  ఆసుపత్రి నిర్వాహకులు చేసిన వినూత్న ఆలోచనకు రోగులు, వారి బంధువులు ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏసీ బీభత్సంగా వాడినా కరెంట్ బిల్లు తక్కువ రావాలా..
ఏసీ బీభత్సంగా వాడినా కరెంట్ బిల్లు తక్కువ రావాలా..
అబ్బా ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఇకపై అక్కడ నో పార్కింగ్‌ ఫీజ్
అబ్బా ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఇకపై అక్కడ నో పార్కింగ్‌ ఫీజ్
Team India: ఫైనల్‌కు ముందు భారత్‌కు తలనొప్పిగా మారిన ఆ ముగ్గురు?
Team India: ఫైనల్‌కు ముందు భారత్‌కు తలనొప్పిగా మారిన ఆ ముగ్గురు?
ఊహించని మలుపులు, దెబ్బకు బాక్సాఫీస్ షేక్..
ఊహించని మలుపులు, దెబ్బకు బాక్సాఫీస్ షేక్..
ప్రపంచమంతా పెట్రోల్ మంటలు.. భారత్‌ మాత్రం ధీమాగా.. మోదీ సర్కార్..
ప్రపంచమంతా పెట్రోల్ మంటలు.. భారత్‌ మాత్రం ధీమాగా.. మోదీ సర్కార్..
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?
కొండముచ్చుకు గుండెపోటు.. నిమిషాల్లోనే అద్భుతం..
కొండముచ్చుకు గుండెపోటు.. నిమిషాల్లోనే అద్భుతం..
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, సిరీస్‌లివే
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, సిరీస్‌లివే
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత
ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే
ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే