TS RJC CET 2025 Exam Date: తెలంగాణ ఆర్జేసీ సెట్ ప్రవేశ పరీక్ష తేదీ ఇదే.. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల జూనియర్ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఆర్జేసీ సెట్ 2025 పరీక్ష ఈ నెలలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను తాజాగా విడుదలైనాయి..

హైదరాబాద్, మే 6: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల జూనియర్ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఆర్జేసీ సెట్ 2025 పరీక్ష ఈ నెలలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను తాజాగా విడుదలైనాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కాగా తెలంగాణ ఆర్జేసీ సెట్ పరీక్ష మే 10న జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 35 గురుకులాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్ధులు తమ హాల్‌టికెట్లను రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.
టీజీ ఆర్జేసీ సెట్ 2025 హాల్‌టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆర్‌ఆర్‌బీ రైల్వే పారా మెడికల్ ‘కీ’ వచ్చేసింది.. మే 11 వరకు అభ్యంతరాల స్వీకరణ
ఆర్‌ఆర్‌బీ పారా మెడికల్ సీబీటీ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రం, ఆన్సర్ కీ తాజాగా విడుదలైంది. దీనిపై అభ్యంతరాలకు రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు(RRB) అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో రూ.50 ఫీజు చెల్లించి మే 6వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు తమ అభ్యంతరాలను తెలుపవచ్చు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్ కీ రూపొందించి తుది ఫలితాలను వెల్లడిస్తారు. కాగా రైల్వే శాఖ ఏప్రిల్ 28వ తేదీ నుంచి 30 వరకు దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ విభాగాల్లోని పారా మెడికల్ పోస్టులకు ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఆర్‌ఆర్‌బీ రైల్వే పారా మెడికల్ ఆన్సర్ ‘కీ’ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




