AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inter Supply 2025 Hall tickets: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు వచ్చేశాయ్‌.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్, సెకండ్‌ ఇయర్‌ ఫెయిలైన విద్యార్ధులకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌ టికెట్లను విడుదల చేసింది. మే 6వ తేదీ నుంచి విద్యార్ధులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని..

Inter Supply 2025 Hall tickets: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు వచ్చేశాయ్‌.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
Inter Advanced Supplementary Exams
Srilakshmi C
|

Updated on: May 06, 2025 | 2:32 PM

Share

అమరావతి, మే 6: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్, సెకండ్‌ ఇయర్‌ ఫెయిలైన విద్యార్ధులకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌ టికెట్లను విడుదల చేసింది. మే 6వ తేదీ నుంచి విద్యార్ధులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని, విద్యార్ధులు వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. విద్యార్ధులు వెబ్‌సైట్‌తోపాటు ‘మన మిత్ర’ వాట్సప్‌ యాప్‌ 95523 00009 నుంచి కూడా హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఏపీ ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ సప్లిమెంటరీ పరీక్షల 2025 హాల్‌టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాగా ఏపీ ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్ ఇయర్‌ విద్యార్థులకు మే 12 నుంచి మే 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ కూడా విడుదలైంది. మే 28 నుంచి జూన్‌ 1 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు జరగనున్నాయి. జూన్‌ 4న ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌ పరీక్ష , జూన్ 6న పర్యావరణ విద్య నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్ధులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సెకండ్ ఇయర్‌ విద్యార్ధులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. ఏపీ ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ 2025 పరీక్షల పూర్తి షెడ్యూల్ ఈ కింద చెక్ చేసుకోండి..

ఇవి కూడా చదవండి

ఇంటర్ ఫస్ట్‌ ఇయర్ సప్లిమెంటరీ టైమ్ టేబుల్ 2025 ఇదే..

  • మే 12.. సెకండ్‌ లాంగ్వేజ్ పేపర్ 1
  • మే 13.. ఇంగ్లీష్ పేపర్ 1
  • మే 14.. మ్యాథ్స్ పేపర్ 1A, బోటనీ పేపర్ 1, సివిక్స్ పేపర్ 1
  • మే 15.. మ్యాథ్స్ పేపర్ 1B, జువాలజీ 1, హిస్టరీ 1
  • మే 16.. ఫిజిక్స్ పేపర్ 1, ఎకానమిక్స్ పేపర్ 1
  • మే 17.. కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1, సోషియాలజీ పేపర్ 1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 1
  • మే 19.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, లాజిక్ పేపర్ 1, మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్స్ పేపర్ 1 (బైపీసీ విద్యార్థులకు)
  • మే 20.. మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జాగ్రఫీ పేపర్  1

ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ సప్లిమెంటరీ 2025 టైమ్ టేబుల్..

  • మే 12.. సెకండ్‌ లాంగ్వేజ్ పేపర్ 2
  • మే 13.. ఇంగ్లీష్ పేపర్ 2
  • మే 14.. మ్యాథ్స్ పేపర్ 2A, బోటనీ పేపర్ 2, సివిక్స్ పేపర్ 2
  • మే 15.. మ్యాథ్స్ పేపర్ 2B, జువాలజీ 2, హిస్టరీ 2
  • మే 16.. ఫిజిక్స్ పేపర్ 2, ఎకానమిక్స్ పేపర్2
  • మే 17.. కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2, సోషియాలజీ పేపర్ 2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 2
  • మే 19.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, లాజిక్ పేపర్ 2, మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్స్ పేపర్ 2 (బైపీసీ విద్యార్థులకు)
  • మే 20.. మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 2, జాగ్రఫీ పేపర్ 2

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
రోహిత్ ఎలిమినేషన్ ట్విస్ట్: సీక్రెట్ రూమ్ ఆఫర్ రిజెక్ట్..
రోహిత్ ఎలిమినేషన్ ట్విస్ట్: సీక్రెట్ రూమ్ ఆఫర్ రిజెక్ట్..
చెల్లెలిని ప్రేమించాడని యువకుడిని నడిరోడ్డుపై నరికి చంపిన అన్న..
చెల్లెలిని ప్రేమించాడని యువకుడిని నడిరోడ్డుపై నరికి చంపిన అన్న..
కేవలం రూ.400కే వాటర్ ట్యాంకర్.. హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్
కేవలం రూ.400కే వాటర్ ట్యాంకర్.. హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్
చికెన్‌తో మస్త్ కాంబినేషన్ ఈ చారు.. దెబ్బకు జలుబు, దగ్గు మటాష్
చికెన్‌తో మస్త్ కాంబినేషన్ ఈ చారు.. దెబ్బకు జలుబు, దగ్గు మటాష్
ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోయే బీట్రూట్ పల్లీల చట్నీ..
ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోయే బీట్రూట్ పల్లీల చట్నీ..
ప్లాస్టిక్ సంచిలో బాలుడు, బాలిక బొమ్మలు.. శ్మశానవాటికలో కలకలం!
ప్లాస్టిక్ సంచిలో బాలుడు, బాలిక బొమ్మలు.. శ్మశానవాటికలో కలకలం!
దిగ్బల యోగంతో వీరికి ఉద్యోగంలో గోల్డెన్ డేస్..!
దిగ్బల యోగంతో వీరికి ఉద్యోగంలో గోల్డెన్ డేస్..!
శివ ఫస్ట్ డే షూటింగ్‏లో ఆర్జీవీ చెప్పిన మాటకు గుండె కొట్టుకుంది.
శివ ఫస్ట్ డే షూటింగ్‏లో ఆర్జీవీ చెప్పిన మాటకు గుండె కొట్టుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఢమాల్.. నేటి రేట్లు ఇవే..
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఢమాల్.. నేటి రేట్లు ఇవే..
అద్దె బకాయి.. ఇంటి నుంచి గెంటివేత.. పెట్టెలోని ఫొటో చూసి PM ఫోన్!
అద్దె బకాయి.. ఇంటి నుంచి గెంటివేత.. పెట్టెలోని ఫొటో చూసి PM ఫోన్!