అయోధ్య రాముడి అలంకరణతో.. జాతీయ ఖ్యాతి గణించిన దుబ్బాక చేనేత వస్త్రం..

అయోధ్యరాముడి అలంకరణకు దుబ్బాక చేనేత వస్త్రం ఉపయోగించడం పట్ల దుబ్బాక చేనేత కార్మికులు హర్షించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత వస్త్ర ఖ్యాతి దేశం నలుమూలల విస్తరించింది. నూతన వస్త్ర డిజైన్లకు అనుగుణంగా తయారుచేస్తూ ప్రశంసలు పొందుతున్నారు దుబ్బాక చేనేత కార్మికులు. సాక్షాత్తు అయోధ్య శ్రీరామచంద్రుడే దుబ్బాక చేనేత వస్త్రాన్ని ధరించి మరింత ఖ్యాతిని విస్తరింపజేశాడు.

అయోధ్య రాముడి అలంకరణతో.. జాతీయ ఖ్యాతి గణించిన దుబ్బాక చేనేత వస్త్రం..
Ayodhya Rama Mandir
Follow us
P Shivteja

| Edited By: Srikar T

Updated on: May 29, 2024 | 5:05 PM

అయోధ్యరాముడి అలంకరణకు దుబ్బాక చేనేత వస్త్రం ఉపయోగించడం పట్ల దుబ్బాక చేనేత కార్మికులు హర్షించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత వస్త్ర ఖ్యాతి దేశం నలుమూలల విస్తరించింది. నూతన వస్త్ర డిజైన్లకు అనుగుణంగా తయారుచేస్తూ ప్రశంసలు పొందుతున్నారు దుబ్బాక చేనేత కార్మికులు. సాక్షాత్తు అయోధ్య శ్రీరామచంద్రుడే దుబ్బాక చేనేత వస్త్రాన్ని ధరించి మరింత ఖ్యాతిని విస్తరింపజేశాడు. వారం రోజుల పాటు రోజుకో రంగుతో తయారైన వస్త్రాన్ని శ్రీరాముడికి అలంకరించేందుకు అర్డర్ అందుకున్నారు. దుబ్బాకలో ఏర్పాటైన దుబ్బాక హైండ్ల్యూస్ కంపెనీలో తయారైన లినెన్ ఇక్కత్ చేనేత వస్త్రాన్ని (పింక్ కలర్) ఆదివారం ఆయోధ్య రాముడికి అలంకరించి ప్రశంసలు అందుకున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బోడ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. అయోధ్య రాముడి అలంకరణకు తాము తయారు చేస్తున్న లినెన్ వస్త్రాలు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు.

ప్రతి సోమవారం నుంచి ఆదివారం వరకు వివిధ రంగులతో తయారు చేసిన వస్త్రాలను రాముడికి అలంకరించేందుకు ఢిల్లీకి చెందిన డిజైనర్ మనీశ్తోత్రిపాఠి ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో దుబ్బాకలో తయారైన లినెన్ చేనేత వస్త్రం డిజైన్లు నచ్చి తమ కంపెనీకి అర్డర్ ఇచ్చారని శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం రెండు రంగులతో కూడిన రెండు డిజైన్ లినెన్ ఇక్కత్ వస్రాలను అందించామన్నారు. ప్రతి వస్త్రం 12 మీటర్ల పొడవు ఉంటుందన్నారు. ఆదివారం శ్రీరాముడికి పింక్ కలర్ వస్త్రాన్ని అలంకరణ చేసే నిబంధన ఉండటంతో తాము తయారు చేసిన పింక్ కలర్ వస్త్రాన్ని రాముడికి అలంకరించినట్లు డిజైనర్‎తో పాటు ఆలయ కమిటీ సభ్యులు సమాచారం అందజేశారు. మరో ఐదు రోజులకు ఐదు డిజైన్లతో కూడిన వస్త్రాలను తయారు చేసి అందజేయనున్నట్లు చైర్మన్ బోడ శ్రీనివాస్ తెలిపారు. గత ఫిబ్రవరిలో ఢిల్లీలో జాతీయ స్థాయిలో కేంద్ర చేనేత, జౌళీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విరాసత్ పేరిట చేనేత చీరల ప్రదర్శనలో దుబ్బాకలో తయారైన లినెన్ చీరకు స్థానం దక్కింది. దీంతో దుబ్బాక చేనేత కార్మికులు ప్రశంసలు అందుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..