Watch Video: పెద్ద ఎత్తున ఏనుగుల గుంపు శబ్ధాలు..వెళ్లి చూసిన అటవీ అధికారులు షాక్..

తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఓ ఏనుగు పిల్ల బావిలో పడిపోయింది. కోలపల్లిలోని కురింజి నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి ఏనుగు పిల్ల ప్రమాదవశాత్తు బావి పడిపపడింది. దీంతో అక్కడ నుంచి మిగతా ఏనుగులు పెద్ద ఎత్తున శబ్దాలు చేశాయి. అయితే రాత్రి సమయంలో అక్కడికి ఎవరూ వెళ్లలేదు. ఉదయం వెళ్లి చూస్తే.. బావిలో ఏనుగు పిల్ల పడిపోయి ఉంది. వెంటనే ఈ విషయం గురించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానికులు.

Watch Video: పెద్ద ఎత్తున ఏనుగుల గుంపు శబ్ధాలు..వెళ్లి చూసిన అటవీ అధికారులు షాక్..

|

Updated on: May 29, 2024 | 2:17 PM

తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఓ ఏనుగు పిల్ల బావిలో పడిపోయింది. కోలపల్లిలోని కురింజి నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి ఏనుగు పిల్ల ప్రమాదవశాత్తు బావి పడిపపడింది. దీంతో అక్కడ నుంచి మిగతా ఏనుగులు పెద్ద ఎత్తున శబ్దాలు చేశాయి. అయితే రాత్రి సమయంలో అక్కడికి ఎవరూ వెళ్లలేదు. ఉదయం వెళ్లి చూస్తే.. బావిలో ఏనుగు పిల్ల పడిపోయి ఉంది. వెంటనే ఈ విషయం గురించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. రంగంలోకి దిగిన అటవీ అధికారులు.. జేసీబీ సాయంలో ఏనుగు పిల్లను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందుకోసం బావికి సమాంతరంగా తవ్వకాలు చేపట్టారు. ఆహారం, నీటి కోసం ఏనుగులు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ప్రమాదంలో పడుతుంటాయని స్థానికులు తెలిపారు. బావిలో చిక్కుకున్న ఏనుగుపిల్లను సురక్షితంగా బయటకు తీసేందుకు అక్కడి చెట్లు అన్ని తొలగించారు. ఏనుగు పిల్లను సురక్షితంగా కాపాడేందుకు ముమ్మర ఏర్పాటు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us