AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apsara Murder Case: అప్సరకు ముందే వివాహం జరిగింది.. శంషాబాద్‌ మర్డర్ కేసులో విస్తుపోయే నిజాలు..

Hyderabad: జాతకం కోసం మొదట సాయికృష్ణ దగ్గరకు వెళ్లింది అప్సర. ఇలా వివిధ రకాల పూజలతో అప్సరకు దగ్గరయ్యాడు సాయి కృష్ణ. ఇదే క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది అప్సర. లేకుంటే ఇద్దరి మధ్య రిలేషన్‌ను బయట పెడతానని బెదిరింపు.

Apsara Murder Case: అప్సరకు ముందే వివాహం జరిగింది.. శంషాబాద్‌ మర్డర్ కేసులో విస్తుపోయే నిజాలు..
Apsara Marriage Photos
Sanjay Kasula
|

Updated on: Jun 11, 2023 | 10:13 AM

Share

హైదరాబాద్, జూన్ 11: అప్సర హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్సరకు ముందే వివాహం జరిగినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. భర్తతో విభేదాల అనంతరం పుట్టింట్లో ఉంటున్నట్లుగా సమాచారం. జాతకం కోసం మొదట సాయికృష్ణ దగ్గరకు వెళ్లింది అప్సర. ఇలా వివిధ రకాల పూజలతో అప్సరకు దగ్గరయ్యాడు సాయి కృష్ణ. ఇదే క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది అప్సర. లేకుంటే ఇద్దరి మధ్య రిలేషన్‌ను బయట పెడతానని బెదిరింపు. స్కెచ్ వేసి అప్సరను అంతమొందించాడు సాయికృష్ణ. ఇదే క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది అప్సర. లేకుంటే ఇద్దరి మధ్య రిలేషన్‌ను బయట పెడుతానంటూ బెదిరింపులు మొదలు పెట్టింది. అప్సర బెదిరింపులతో చంపేందుకు స్కెచ్ వేశాడు సాయి కృష్ణ. ఈ నెల 3వ తేదీ పక్క ప్లాన్ ప్రకారం అప్సరను హత్య చేసింది సాయి కృష్ణ.

ఇదిలావుంటే, అప్సర హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్సర గర్భవతి కాదంటూ ప్రిలిమినరీ పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇచ్చారు వైద్యులు. చనిపోయే సమయానికి అప్సర గర్భవతని.. దాని విషయంలోనే గొడవ జరిగిందని ముందుగా ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని ఈ రిపోర్ట్‌తో క్లారిటీ వచ్చింది.

అటు సాయికృష్ణ రిమాండ్ రిపోర్ట్‌లోనూ కీలక అంశాలను ప్రస్తావించారు పోలీసులు. గత ఏడాది ఏప్రిల్ నుంచి సాయికృష్ణ, అప్సర మధ్య పరిచయం ఏర్పడింది. బంగారు మైసమ్మ గుడి కేంద్రంగానే ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. తరచూ అప్సరకు వాట్సాప్ ద్వారా మెసేజెస్ చేసేవాడు. గతేడాది నవంబర్‌లో ఇద్దరూ కలిసి గుజరాత్‌ టూర్‌ కూడా వెళ్లారు. అక్కడ వీరిద్దరి బంధం మరింత బలపడినట్టు పోలీసులు విచారణలో తేలింది.

వాట్సాప్ ద్వారా అప్సర లవ్ ప్రపోజ్ చేసింది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసేదనీ.. చేసుకోకపోతే రోడ్డుకు ఈడుస్తానంటూ బ్లాక్ మెయిల్ చేసేదని చెప్తున్నాడు సాయికృష్ణ. అప్సరను అడ్డు తొలగించుకునేందుకే హత్యకు స్కెచ్‌ వేశాడు. ” హవ్ టు కిల్ టు హ్యూమన్ బీయింగ్” అని గూగుల్లో వెతికి మరీ ప్లాన్ చేశాడు. ఎప్పటి నుంచో కోయంబత్తూర్‌కి తీసుకెళ్లాలని అప్సర కోరడంతో.. టూర్ ప్లాన్ చేశాడు. పక్కా ప్లానింగ్ ప్రకారం చంపేసినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టం చేశారు పోలీసులు.

కానీ అప్సర హత్యపై నిందితుడు సాయికృష్ణ, అప‌్సర కుటుంబాల వాదనలు భిన్నంగా ఉన్నాయి. యాక్సిడెంటల్‌గా జరిగి ఉండొచ్చని ఆరోపిస్తున్నారు సాయికృష్ణ భార్య. పెళ్లైన సాయి నైట్ టైంలో ఇంటికి వస్తుంటే వాళ్ల అమ్మగారు వారించకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు సాయి కృష్ణ భార్య. ఇక సాయికృష్ణ కూడా పోలీసుల దగ్గర మాటా మారుస్తున్నాడు. అప్సరకు చెన్నైలో మరో యువకుడితో సంబంధం ఉందని.. తనను పెళ్లిపేరుతో వేధించిందని అంటున్నారు.

మరోవైపు బంగారు మైసమ్మ దేవాలయానికి సంప్రోక్షణ చేశారు పూజారులు. అప్సర హత్య తర్వాత ఐదుసార్లు ఆలయానికి వచ్చాడు సాయి. దీంతో అప్సర అంత్యక్రియల అనంతరం.. ఆలయంలో శాంతి హోమం జరిపించాలని నిర్ణయించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం