AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna water రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జలజగడం.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ నీటి సంఘాల ఫిర్యాదు

కృష్ణా నదీ జలాల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సమస్యపై రెండు తెలుగు రాష్ట్రాల నేతలు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు, ఘాటు వ్యాఖ్యలు చేసుకుంటూనే ఉన్నారు.

Krishna water రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జలజగడం.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ నీటి సంఘాల ఫిర్యాదు
Krishna River Board
Balaraju Goud
|

Updated on: Jul 15, 2021 | 3:23 PM

Share

AP Representatives meets KRMB Chairman: కృష్ణా నదీ జలాల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సమస్యపై రెండు తెలుగు రాష్ట్రాల నేతలు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు, ఘాటు వ్యాఖ్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యవహారంపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ తెలంగాణ నేతలు స్పష్టం చేస్తుండగా.. ఎపి నేతలు సైతం తెలంగాణ తీరును ఎండగడుతున్నారు

ఈ నేపథ్యంలోనే గురువారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌తో ఆంధ్రప్రదేశ్ నీటి సంఘాల ప్రతినిధులు సమావేశం అయ్యారు. హైదరాబాద్‌ జలసౌధలో కృష్ణా డెల్టా, సాగర్‌ ఆయకట్టు ప్రతినిధులు ఆయనతో భేటీ అయ్యారు. తెలంగాణ తీరుతో ఏపీ రైతులు నష్టపోతున్నారని ఫిర్యాదు చేశారు.

కృష్ణా జలాల సమస్యపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాల మంత్రులతో సహా నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సమస్యను వివరించేందుకు ఏపీ నీటి సంఘాల ప్రతినిధులు కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌ను కలిశారు.

ఇదిలావుంటే, కృష్ణా జలాలు, నీటి ప్రాజెక్టులపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కృష్ణా నదీ జలాలపై తెలంగాణ అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా సుప్రీంకోర్డులో పిటిషన్ దాఖలు చేసింది. కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరిస్తోందని.. విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోందని పిటిషన్లో పేర్కొంది. ఏపీకి రావాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందని ఆరోపించింది. ఈ సందర్భంగా కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు పరిధిని నోటిఫై చేయాలని అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది.

Read Also….  Indian Railway: సికింద్రాబాద్, విశాఖపట్నం నుంచి ఇతర ప్రాంతాలకు మరిన్ని ప్రత్యేక రైళ్లు