హైదరాబాద్ పాతబస్తీలో రౌడీ షీటర్లకు ప్రాణభయం.. పోలీసుల గస్తీ! ఏం జరిగిందంటే..
హైదరాబాద్ పాతబస్తీలో రౌడీ షీటర్ల ప్రాణాలకు ముప్పు తలెత్తింది. పాత బస్తీలోని రౌడీ షీటర్లు ఒక్కొక్కరుగా టార్గెట్ అవుతున్నారు! ఇప్పటికే కొంతమంది చనిపోయారు. ఇంకొందరు ఆసుపత్రి పడకపై ప్రాణాలతో పోరాటం చేస్తున్నారు. తాజాగా రెయిన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబీర్‌పురా దర్వాజా వద్ద మరో రౌడీ షీటర్‌పై..

హైదరాబాద్, ఆగస్ట్ 16: హైదరాబాద్ పాతబస్తీలో టెన్షన్ నెలకొంది. రౌడీ షీటర్ల ప్రాణాలకు ముప్పు తలెత్తింది. పాత బస్తీలోని రౌడీ షీటర్లు ఒక్కొక్కరుగా టార్గెట్ అవుతున్నారు! ఇప్పటికే కొంతమంది చనిపోయారు. ఇంకొందరు ఆసుపత్రి పడకపై ప్రాణాలతో పోరాటం చేస్తున్నారు. తాజాగా రెయిన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబీర్‌పురా దర్వాజా వద్ద మరో రౌడీ షీటర్‌పై కత్తితో దాడి జరిగింది. ఖిజార్ యాకుబీ అనే అనుమానిత రౌడీ షీటర్ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు స్పందించి అతన్ని వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీంతో రౌడీ షీటర్లకు భయం పట్టుకుంది. తమపై ఎవరు ఎప్పుడు దాడి చేస్తారో తెలియక గజగజలాడుతున్నారు.
తాజాగా జరిగిన దాడి వెనుక పాత కక్షలా? లేక గ్యాంగ్ వార్ కోణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు. గత కొంత కాలంగా పాతబస్తీలో రౌడీ షీటర్లపై దాడులు పెరుగుతున్నాయి! అందుకే అక్కడ పోలీసులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




