మారుతీ రావు.. ఆస్తుల లెక్క చూస్తే దిమ్మ తిరగాల్సిందే!
ఇప్పుడు మారుతీరావు ఆస్తి ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్‌గా మారింది. మారుతీ రావు భార్య, తమ్ముడి పేరు మీదనే ఆస్తులు రాసినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం బహిరంగ మార్కెట్ ప్రకారం ఆస్తుల విలువ రూ.200 కోట్లు..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసులో అమృత-ప్రణయ్‌ల ప్రేమ ఉదంతం ఒకటి. కులాంతర వివాహం చేసుకుందని కూతురు మీద కోపంతో.. దారుణంగా అల్లుడిని చంపించాడు మారుతీరావు. అనంతరం ఈ హత్య కేసులో 6 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత కేసు సయోధ్య కోసం కూతురితో ఎన్ని రకాలుగా రాయబారాలు జరిపినా.. ఆమె స్పందించలేదు. అంతేకాకుండా.. ప్రణయ్ హత్య కేసు కూడా హియరింగ్‌కి రావడంతో ఒత్తిడి తట్టుకోలేక పోయిన.. మారుతీరావు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత.. తండ్రి కడసారి చూపు కోసం శ్మశాన వాటికకు వెళ్లిన అమృతకు చేధు అనుభవం ఎదురైంది. ‘అమృత గో బ్యాక్ అంటూ’ నినాదాలు చేయడంతో.. తండ్రిని చూడకుండానే వెనుదిరిగింది అమృత.
అయితే ఇప్పుడు మారుతీరావు ఆస్తి ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్‌గా మారింది. మారుతీ రావు భార్య, తమ్ముడి పేరు మీదనే వీలునామా రాసినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం బహిరంగ మార్కెట్ ప్రకారం మారుతీరావు ఆస్తుల విలువ రూ.200 కోట్లుగా లెక్క ఉందట. మొదట కిరోసిన్ డీలర్‌గా వ్యాపారం చేసిన మారుతీరావు.. తర్వాత రైస్ మిల్లుల బిజినెస్ మొదలు పెట్టారు. అనంతరం రైస్ మిల్లులు అమ్మి రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగాడు. అలాగే.. మారుతీరావుకి బినామీలు కూడా ఉన్నట్లు అమృత కూడా చెప్పింది. మరి బినామీల లెక్కన ఇంకెంత ఆస్తి ఉందో తెలియాలి.
చార్జ్ షీట్‌లో మారుతీరావు ఆస్తుల వివరాలు:
1. శరణ్య గ్రీన్ హోమ్స్ పేరుతో వంద విల్లాలు విక్రయం 2. అమృత ఆస్పత్రి పేరుతో వంద పడకల ఆస్పత్రి 3. భార్య గిరిజ పేరుతో పది ఎకరాల భూమి 4. హైదరాబాద్ కొత్తపేటలో 400 గజాల స్థలం 5. హైదరాబాద్‌లో పలు చోట్ల 5 ఫ్లాట్లు 6. మిర్యాలగూడలో ఓ షాపింగ్ మాల్ 7. ఈదులగూడెం క్రాస్ రోడ్‌లో మరో షాపింగ్ మాల్ 8. మారుతీ రావు తల్లి పేరుతో రెండంతస్తుల భవనం 9. మిర్యాల గూడ బైపాస్ రోడ్‌లో 22 గుంటల భూమి
Read More: ఒంటరైన మారుతీరావు భార్య.. నేరం ఎవరిది? శిక్ష ఎవరికి!
శ్మశాన వాటికలో ఉద్రిక్త పరిస్థితులు.. కడసారి చూపుకు నోచుకోని అమృత
అమృత, ప్రణయ్‌ల లవ్‌స్టోరిపై సినిమా.. హీరో ఎవరంటే?
పొలిటికల్ పార్టీలకు రూ.2,512 కోట్ల విరాళాలు.. ఇచ్చిందెవరో తెలీదు!
నీకు సిగ్గుందా.. అంటూ అమృతపై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్