మమ్మల్ని లాగవద్దు.. మంత్రి కొండా సురేఖపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసిన అక్కినేని అమల

సోషల్ మీడియా ట్రోల్స్‌పై కాంగ్రెస్‌ - బీఆర్‌ఎస్ మధ్య రాజుకున్న చిచ్చు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల జీవితాలను తెరపైకి తీసుకొచ్చింది.

మమ్మల్ని లాగవద్దు.. మంత్రి కొండా సురేఖపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసిన అక్కినేని అమల
Akkineni Amala
Follow us

|

Updated on: Oct 02, 2024 | 10:46 PM

సోషల్ మీడియా ట్రోల్స్‌పై కాంగ్రెస్‌ – బీఆర్‌ఎస్ మధ్య రాజుకున్న చిచ్చు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల జీవితాలను తెరపైకి తీసుకొచ్చింది. పోస్ట్‌పై తీవ్రస్థాయిలో వివాదం నడుస్తుంటే.. దాన్ని కంట్రోల్ చేయబోయి మరో టాపిక్‌ను మధ్యలోకి లాగారు. ఇప్పుడది చినికి చినికి గాలివానగా మారింది. ఇది కాస్తా చిత్ర పరిశ్రమకు అంటుకుంది.

ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు సినీ నటి అక్కినేని అమల. తన ఫ్యామిలీపై అసత్య ఆరోపణలు చేసిన కొండా సురేఖపై మండిపడ్డారు అక్కినేని అమల. రాజకీయ వివాదాల్లోకి మమ్మల్ని లాగవద్దు.. నా భర్త గురించి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటు.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అమల. రాజకీయ నాయకులే నేరస్థుల్లా ప్రవర్తిస్తే, ఈ దేశం ఏమైపోతుంది? మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పేలా రాహుల్ గాంధీ చొరవ తీసుకోవాలని అక్కినేని అమల డిమాండ్ చేశారు.

బీఆర్‌ఎస్ సోషల్ మీడియా టీమ్‌పై కొండా సురేఖ ఆరోపణలు చేశారు. క్షమాపణలు చెప్పలేదని కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖ కన్నీటిపర్యంతమయ్యారు. ఓ సభలో బీజేపీ ఎంపీ రఘునందన్‌ తనకు మెడలో దండ వేస్తే.. సోషల్ మీడియాలో అడ్డగోలుగా ట్రోల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ట్రోల్ చేసింది బీఆర్ఎస్ సోషల్ మీడియా టీమేనని ఆరోపించారు. వెంటనే కేటీఆర్, హరీష్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ట్రోల్‌తో మొదలైన వివాదంపై మాజీ మంత్రి హరీష్‌రావు ట్వీట్ చేశారు. సురేఖకు కలిగిన అవమానానికి బాధపడుతున్నానని అన్నారు. అయితే కేటీఆర్ మాత్రం స్పందించలేదు. ఈ క్రమంలో సురేఖ మరోసారి కేటీఆర్‌పై విమర్శలు చేశారు.

కేటీఆర్‌పై విమర్శలు చేసే క్రమంలో మంత్రి కొండా సురేఖ, సినిమా ఇండస్ట్రీని మధ్యలోకి లాగారు. ఇండస్ట్రీలో చాలామందికి కేటీఆర్‌ డ్రగ్స్ అలవాటు చేశారన్నారు. ఒకరిద్దరి పేర్లను కూడా ప్రస్తావించారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమకు చెందిన కొందరు తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. సురేఖ వ్యాఖ్యల్ని ఇండస్ట్రీకి చెందిన పలువురు ఖండిస్తూ.. క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పెద్దలు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే అక్కినేని అమల సోషల్ మీడియా వేదికగా కొండా సురేఖపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..