ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత ఈసీ ఆల్ పార్టీ మీటింగ్.. 4 గంటలు సుదీర్ఘంగా సాగిన చర్చలో..
ఇక ఈసీ PPT అవ్వగానే సమావేశంలో పాల్గొన్న ఆయా పార్టీలు తమ తమ అభిప్రాయాలను, ఫిర్యాధులను ఈసీ కి ఇచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ , BRS సభ్యుల మధ్య ఈసీ సమావేశంలోనే మాటల యుద్ధం జరిగింది. ముఖ్యమంత్రి అధికారిక భవనంలో పార్టీ బి -ఫామ్స్ ఎలా పంపిణి చేస్తారని కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నించారు. కాంగ్రెస్ అడిగిన వెంటనే బేస్ లెస్ వ్యాఖ్యలంటూ BRS ప్రతినిధులు కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది...
షెడ్యూల్ విడుదలైన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించింది ఈసీ. ఈ సమావేశానికి హాజరైన పొలిటికల్ పార్టీలకు ఎన్నికల నిర్వహణ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు వికాస్ రాజ్. అనంతరం ఆయా పార్టీల ఫిర్యాదు స్వీకరించింది ఈసీ. ఎన్నికల నగారా మొగిన తరువాత తెలంగాణ ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించింది. దాదాపు నాలుగు గంటలపాటు సుధీర్గ సమావేశం పెట్టింది ఈసీ. ఈ సమావేశంలో పాల్గొన్న పొలిటికల్ పార్టీలకు సీఈఓ వికాస్ రాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఎన్నికల నిర్వహణలో రాజకీయ పార్టీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితరులు అంశాలపై సూచనలు చేసింది ఈసీ.
ఇక ఈసీ PPT అవ్వగానే సమావేశంలో పాల్గొన్న ఆయా పార్టీలు తమ తమ అభిప్రాయాలను, ఫిర్యాధులను ఈసీ కి ఇచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ , BRS సభ్యుల మధ్య ఈసీ సమావేశంలోనే మాటల యుద్ధం జరిగింది. ముఖ్యమంత్రి అధికారిక భవనంలో పార్టీ బి -ఫామ్స్ ఎలా పంపిణి చేస్తారని కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నించారు. కాంగ్రెస్ అడిగిన వెంటనే బేస్ లెస్ వ్యాఖ్యలంటూ BRS ప్రతినిధులు కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ప్రగతి భవన్ లో బి ఫామ్స్ పంపిణి పై ఇప్పటికే విచారణకు అదేశించినట్లు సీఈఓ వికాస్ రాజ్ వివరణ ఇచ్చినట్లు సమాచారం.
ఇక సీఈఓ సమావేశంలో బీజేపీ పార్టీ కేంద్ర బాలగాలను రాష్ట్రంలో డిప్లై చేసి సర్కార్ కు అనుకూలంగా వ్యవహారిస్తున్న అధికారులను ఎన్నికల నిర్వహణ నుంచి తప్పించాలని కొరింది. ఇక అధికార BRS పార్టీ గుర్తును పోలిన గుర్తు, సోషల్ మీడియా కట్టడి, ఇతర రాష్ట్రాల నుంచి డబ్బుల తరలింపు కట్టడి చేయాలనీ విజ్ఞప్తి చేసారు. ఇక లిక్కర్ బ్యాన్ చేయాలనీ ఆప్ పార్టీ కోరగా, బ్యాలెట్ ఓటింగ్ పెట్టి ఎలక్షన్ నిర్వహించాలని KA పాల్ ప్రజాశాంతి ప్రతినిది కోరారు.
అదే విధంగా బోగస్ ఓట్ల పై ఈసీ ఇప్పటికీ క్లారిటి ఇవ్వలేదని ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరింది సిపిఎం. పొలిటికల్ పార్టీలకు దిశానిర్దేశం చేసిన ఈసీ. ఆయా పార్టీల ఫిర్యాదులపై అన్నింటికీ సమాధానం చెప్తామని పేర్కొన్నట్లు వివరించింది. మరి ఆయా పార్టీల డిమాండ్ ప్రకారం ఈసీ చర్యలు రానున్న రోజుల్లో ఎలా ఉంటాయో చూడాలి మరి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..