Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓర్నాయనో.. కల్లు తాగినాక నాలుక మొద్దు బారింది.. మెడ వంకర్లు పోయింది.. చివరకు 69 మంది..

తెలంగాణ కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపింది.. బీర్కూర్, నసుర్లబాద్ మండలాల్లో 69 మంది అస్వస్తత గురి కాగా.. అందులోని 13 మంది పరిస్థితి విషమంగా ఉంది. అయితే.. ఒకేసారి 69 మంది ఆసుపత్రిలో చేరడంతో కల్తీ కల్లు ఉదంతం చర్చనీయాంశమైంది. నస్రుల్లాబాద్‌ మండలంలోని అంకోల్‌, అంకోల్‌ క్యాంపు, దుర్కితో పాటు బీర్కూర్‌ మండలంలోని దామరంచ గ్రామంలో కల్తీ కల్లు కలకలం రేపింది.

ఓర్నాయనో.. కల్లు తాగినాక నాలుక మొద్దు బారింది.. మెడ వంకర్లు పోయింది.. చివరకు 69 మంది..
Adulterated Toddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 08, 2025 | 1:04 PM

తెలంగాణ కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపింది.. బీర్కూర్, నసుర్లబాద్ మండలాల్లో 69 మంది అస్వస్తత గురి కాగా.. అందులోని 13 మంది పరిస్థితి విషమంగా ఉంది. అయితే.. ఒకేసారి 69 మంది ఆసుపత్రిలో చేరడంతో కల్తీ కల్లు ఉదంతం చర్చనీయాంశమైంది. నస్రుల్లాబాద్‌ మండలంలోని అంకోల్‌, అంకోల్‌ క్యాంపు, దుర్కితో పాటు బీర్కూర్‌ మండలంలోని దామరంచ గ్రామంలో కల్తీ కల్లు వ్యవహారం కలకలం రేపింది. ఈ గ్రామాల నుంచే బాధితులంతా ఆసుపత్రిలో చేరారు. కల్తీ కల్లు ఘటనపై ఎక్సైజ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కల్లు శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపిస్తామని ఎక్సైజ్‌ సీఐ చెప్పారు..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నస్రుల్లాబాద్ మండలం అంకోల్, దుర్కి, అంకోల్ తండా, అలాగే బీర్కూర్​మండలంలోని దామరంచ తదితర గ్రామాల్లో సోమవారం పలువురు కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురయ్యారు. బాధితులను బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కల్తీ కల్లు వల్ల మెడ వంకర్లు, నాలుక మొద్దు బారిందని బాధితులు, వారి కుటుంబీకులు తెలిపారు.

వీడియో చూడండి..

అయితే.. కల్తీ కల్లు తాగిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా మారడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కామారెడ్డి సబ్ కలెక్టర్ కిరణ్మయి బాధితులను పరామర్శించారు. అనంతరం వైద్యులను కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాన్సర్ సైలెంట్ కిల్లర్.. ఈ 5 లక్షణాలు అస్సలు లైట్ తీసుకోవద్దు
క్యాన్సర్ సైలెంట్ కిల్లర్.. ఈ 5 లక్షణాలు అస్సలు లైట్ తీసుకోవద్దు
ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడైనా తిన్నారా.?ఈ పండుతో ఆ సమస్యలకు చెక్
ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడైనా తిన్నారా.?ఈ పండుతో ఆ సమస్యలకు చెక్
SRHపై విజృంభించిన ముంబై! హిట్ మ్యాన్ సిక్సర్ల సంచలనం!
SRHపై విజృంభించిన ముంబై! హిట్ మ్యాన్ సిక్సర్ల సంచలనం!
కర్రెగుట్టలపై రెండు రోజులుగా బాంబుల వర్షం!
కర్రెగుట్టలపై రెండు రోజులుగా బాంబుల వర్షం!
రూ.345తో 60 రోజుల వ్యాలిడిటీ.. ఉత్తమ రీఛార్జ్‌ ప్లాన్స్‌..!
రూ.345తో 60 రోజుల వ్యాలిడిటీ.. ఉత్తమ రీఛార్జ్‌ ప్లాన్స్‌..!
ఐపీఎల్‌లో కామెంటరీ.. కట్ చేస్తే.. పీఎస్‌ఎల్‌లో ప్లేయర్‌.. ఎవరంటే?
ఐపీఎల్‌లో కామెంటరీ.. కట్ చేస్తే.. పీఎస్‌ఎల్‌లో ప్లేయర్‌.. ఎవరంటే?
కొత్త హీరోయిన్స్ ఆ హీరో బెడ్ ఎక్కాల్సిందే..
కొత్త హీరోయిన్స్ ఆ హీరో బెడ్ ఎక్కాల్సిందే..
వేసవిలో పండిన మామిడికే కాదు.. పచ్చి మామిడికి కూడా మస్తు డిమాండ్
వేసవిలో పండిన మామిడికే కాదు.. పచ్చి మామిడికి కూడా మస్తు డిమాండ్
బెట్టింగ్‌ యాప్స్‌ ఇష్యూ.. మెట్రో ఎండీకి హైకోర్టు నోటీసులు!
బెట్టింగ్‌ యాప్స్‌ ఇష్యూ.. మెట్రో ఎండీకి హైకోర్టు నోటీసులు!
పాన్‌ కార్డుకు గడువు ఉంటుందా..? మరణించిన వ్యక్తి కార్డ్ ఏమవుతుంది
పాన్‌ కార్డుకు గడువు ఉంటుందా..? మరణించిన వ్యక్తి కార్డ్ ఏమవుతుంది