Telangana: ఎమ్మెల్యే ప్రొఫైల్ తో యువతులను బురిడీ కొట్టించిన కేటుగాడు!
షాడి డాట్ కామ్ లో మోసాలకు పాల్పడిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.నిందితుడిని ఐదురోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే ప్రొఫైల్ ను వాడుకొని..ఏకంగా 26 మంది యువతులను పెళ్లి పేరుతో మోసం చేసినట్టు నిందితుడు విచారణలో వెల్లడించారు.

Hyderabad: పెరుగుతున్న టెక్నాలజీతో కొందరు కొత్త వింతలు సృష్టిస్తుంటే..దాన్ని వాడుకొని మరికొందరూ మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో టెక్నాలజీ దుర్వినియోగం మరింత పెరిగిపోయింది. వాట్సాప్ లో డీపీలు మార్చుకొని కొందరు సైబర్ మోసాలకు పాల్పడుతుంటే..ఇతర యాప్స్ ను వాడుకొని కొందరు అమ్మాయిలను మోసం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. జోగాడ వంశీకృష్ణ అనే ఓ వ్యక్తి ఏకంగా ఎమ్మెల్యే ప్రొఫైల్‌ను వాడుకొని యువతులను బురిడీ కొట్టించాడు. షాడి డాట్ కామ్ లో తన ప్రొఫైల్ కు బదులు ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే ప్రొఫైల్ పెట్టి..అమ్మాయిలకు వల వేశాడు. పెళ్లి పేరుతో సుమారు 26 మంది యువతులను నుంచి డబ్బులు వసూలు చేశాడు. పోలీసుల కష్టడీలో ఈ విషయాన్ని స్వయంగా నిందితుడే ఒప్పుకున్నాడు.
షాడి డాట్ కామ్ లో మోసాలకు పాల్పడిన కేసులో జోగాడ వంశీకృష్ణ అనే వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించారు. ఐదు రోజుల కస్టడీ విచారణలో నిందితుడి నుంచి సంచలన విషయాలను రాబట్టారు. ఏపీలోని ఓ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రొఫైల్‌ను వాడుకొని ఈ మోసాలకు పాల్పడినట్టు నిందితులు వెల్లడించాడు. నాలుగు రాష్ట్రాల్లో ఏకంగా 26 మంది యువతులను పెళ్లి పేరుతో నమ్మించి డబ్బులు దండుకున్నట్టు తెలిపాడు. అయితే నిందితుడు వంశీకృష్ణ కూడా ఆ ఎమ్మెల్యేతో పాటే కాకినాడలోని ఓ కాలేజ్ లో చదువుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆ ఎమ్మెల్యే పూర్తి వివరాలతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేయగలిగానని తెలిపాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి