ఆదిలాబాద్ ఎంపీకి తృటిలో తప్పిన పెను ప్రమాదం.. హాకీ పోటీల ప్రారంభోత్సవానికి వెళ్లగా.. వామ్మో ఒక్కసారిగా..
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈదురు గాలుల భీభత్సం సృష్టించాయి. ఇసుక తుఫానును తలపించిన ఈదురు గాలులతో పాటు భారీ వర్షం కురిసింది. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జూనియర్ హాకీ పోటీల ప్రారంభోత్సవానికి చేసిన ఏర్పాట్లు ఈ గాలులకు చెదిరిపోయాయి. టెంట్లు, కుర్చీలు చిందరవందర అయ్యాయి. క్రీడాకారులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది.

ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ కు భారీ ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ హాకీ పోటీల ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన అకస్మాత్తుగా వచ్చిన ఈదురు గాలుల్లో చిక్కుకున్నారు. ఒక్కసారిగా స్టేడియం అంతా ఇసుక తుఫాన్ కమ్మేయడంతో స్టేజ్ పై ఉన్న టెంట్లు గాలికి ఎగిరిపోయాయి. స్టేజ్ పైనే ఉన్న ఎంపి నగేష్ , అధికారులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఎంపి నగేష్ కు రక్షణగా నిలిచి మొఖానికి కర్చీఫ్ కట్టడంతో ఇసుల తుఫాన్ లాంటి ఈదురు గాలుల భీభత్సం నుండి బయటపడ్డారు. సబ్ జూనియర్ హాకీ పోటీల ప్రారంభోత్సవానికి ప్రత్యేక అతిధిగా వచ్చిన ఎంపికి భారీ ప్రమాదమే తప్పింది.
వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఎంపి నగేష్ ను తన కాన్వాయ్‌లోకి తీసుకు వెళ్లారు. కార్యక్రమానికి వచ్చిన గెస్ట్‌లు, క్రీడాకారులంతా పాఠశాలలోకి పరుగులు తీసి తలదాచుకున్నారు. అరగంటపాటు కొనసాగిన గాలివాన దుమారం ఎడారిలో ఇసుక తుఫాన్ ను తలపించింది. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
వీడియో చూడండి..
ఇదే సమయంలో జిల్లా కేంద్రంలో ని కలెక్టర్ చౌరస్తా, కేఆర్కే కాలనీ, రవీంద్ర నగర్ కాలనీలు గాలి వాన భీభత్సానికి చిగురు టాకుల్లా వణికిపోయాయి. కలెక్టరేట్ రోడ్లో అయితే భారీ వృక్షాలు నేలకూలాయి.. విద్యుత్ స్తంబాలు విరిగి పడ్డాయి. కొమురంభీం చౌక్‌లో తృటిలో ప్రాణపాయం నుండి బయటపడ్డారు ప్రయాణికులు. ఒక భారీ వృక్షం ఆటోపై పడటంతో ఆటోలో ఉన్న ఐదుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆటో పూర్తిగా ధ్వంసమైంది.
కేఆర్కే కాలనీలో రేకులు కొట్టుకు పోయాయి. గాలి వాన భీభత్సవానికి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం గంటపాటు వణికిపోయింది. విద్యుత్ వైర్లు ఎక్కడి కక్కడ తెగిపోవడంతో ప్రదాన కాలనీల్లో అంధకారం అలుముకుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..