Schools Reopen Date 2025: వేసవి సెలవులు అయిపోయాయ్.. మరో 2 రోజుల్లోనే పాఠశాలలు పునఃప్రారంభం!
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు సంబంధించి 2025-26 విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో 2025-26 విద్యాసంవత్సరం అకాడమిక్ క్యాలెండర్‌ను విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి సోమవారం విడుదల చేశారు. జూన్ 12 నుంచి పాఠశాలలు తెరచుకోనున్నాయి. తాజాగా విడుదలైన..

హైదరాబాద్, జూన్ 10: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు సంబంధించి 2025-26 విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో 2025-26 విద్యాసంవత్సరం అకాడమిక్ క్యాలెండర్‌ను విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి సోమవారం విడుదల చేశారు. జూన్ 12 నుంచి పాఠశాలలు తెరచుకోనున్నాయి. తాజాగా విడుదలైన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాదిలో విద్యార్ధులకు మొత్తం 230 పనిదినాలుగా ఖరారు చేశారు. పని దినాల్లో ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు నడుస్తాయి. ఇక ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు నడవనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది.
పాఠశాలల్లో ప్రతి రోజు కనీసం 90 శాతం విద్యార్థులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది. ఇక పదో తరగతి విద్యార్ధులకు 2026 జనవరి 10లోగా సిలబస్‌ను పూర్తి చేయాలని అందులో పేర్కొంది. 1 నుంచి 9 తరగతుల విద్యార్ధులకు సిలబస్‌ను ఫిబ్రవరి 28లోగా పూర్తి చేయాలని తెలిపింది. పాఠశాలల్లో ప్రతి రోజు 5 నిమిషాలు యోగా, ధ్యానం చేయించాలని విద్యాశాఖ సూచించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది పదో తరగతి చదివే విద్యార్ధులకు పబ్లిక్ పరీక్షలను 2026 మార్చిలో నిర్వహిస్తామని తెలిపింది.
ప్రతి రోజు 30 నిమిషాలపాటు విద్యార్థుల చేత చదివించేలా అకాడమిక్ క్యాలెండర్‌లో షెడ్యూల్‌ను రూపొందించింది. ఆగస్టు మొదటి లేదా రెండో వారంలో పాఠశాల స్థాయిలో ఆటల పోటీలు, ఆగస్టు మూడో వారంలో జోనల్ టోర్నమెంట్స్ నిర్వహించి జిల్లా సెలక్షన్స్ పూర్తి చేయాలి. ప్రతి నెలా మూడో శనివారం బ్యాగ్‌లెస్‌డేని అమలు చేయాలి. రోజుకు 30 నిమిషాలపాటు పాఠ్యపుస్తకాలు, స్టోరీబుక్స్, దినపత్రికలు, మ్యాగ్జిన్లు వంటి వాటిని విద్యార్ధుల చేత చదివించాలి.
2025-26 సెలవులు ఇలా..
- దసరా 2025 సెలవులు.. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు మొత్తం 13 రోజులు
- క్రిస్మస్ 2025 సెలవులు.. డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 27 వరకు మొత్తం 5 రోజులు
- సంక్రాంతి 2026 సెలవులు.. 11 జనవరి, 2026 నుంచి 15 జనవరి, 2026 వరకు మొత్తం 5 రోజులు
- వేసవి 2026 సెలవులు.. మార్చి 24 నుంచి జూన్ 11 వరకు
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.