IPASE: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2025 ఫలితాలు!
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (TSBIE) ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు (IPASE) ఫలితాలను 2025లో విడుదల కానున్నాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in వెబ్‌సైట్ల ద్వారా తమ హాల్ టికెట్ నంబర్‌తో ఫలితాలను తెలుసుకోవచ్చు.

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి త్వరలో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 విడుదల చేయనుంది. ఈ ఫలితాలు ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు (IPASE) సంబంధించినవి. ఈ పరీక్షలు మే నెలలో రెగ్యులర్ బోర్డు పరీక్షలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం నిర్వహించారు.
ఫలితాలు అధికారిక వెబ్‌సైట్లు.. tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. టీఎస్ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం ఈ కింది వెబ్‌సైట్లను సందర్శించవచ్చు.
- tsbie.cgg.gov.in లేదా
- results.cgg.gov.in
ఈ లింక్‌లపై క్లిక్ చేసి, “TS ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ 2025 – ఫస్ట్ ఇయర్” లేదా “TS ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ 2025 – సెకండ్ ఇయర్” పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి, సబ్మిట్ చేస్తే.. రిజల్ట్ వచ్చేస్తుంది. మీరు సబ్జెక్ట్ వారీగా మార్కులు, మొత్తం మార్కులు, ఉత్తీర్ణత/ఫెయిల్ స్థితి వంటి వివరాలను చూసుకోవచ్చు. అలాగే మార్క్ షీట్ PDFని డౌన్‌లోడ్ చేసుకోచ్చు.
మరిన్ని కెరీర్, ఉద్యోగాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి