Adilabad: యూట్యూబ్‌ చూసి బ్రకోలి సాగు… లక్షల్లో లాభాలు గడిస్తోన్న రైతు

ఎప్పుడూ పాత పంటలేనా కాస్త కొత్తగా ట్రై చేయాలని అనుకున్నాడు ఆ రైతు.  యూట్యూబ్‌లో బ్రకోలి పంట సాగు విధానాలను చూసి ఆకర్షితుడయ్యాడు.

Adilabad: యూట్యూబ్‌ చూసి బ్రకోలి సాగు... లక్షల్లో లాభాలు గడిస్తోన్న రైతు
బ్రకోలి సాగుతో లాభాల పంట
Follow us

|

Updated on: Dec 10, 2021 | 8:08 PM

ఎప్పుడూ పాత పంటలేనా కాస్త కొత్తగా ట్రై చేయాలని అనుకున్నాడు ఆ రైతు. యూట్యూబ్‌లో బ్రకోలి పంట సాగు విధానాలను చూసి ఆకర్షితుడయ్యాడు. మనమెందుకు సాగు చేయకూడదని.. ఆ దిశగా అడుగులు వేశాడు. కేవలం 2 ఎకరాల్లో మాత్రమే ఈ పంట సాగు చేస్తూ లక్షలు కొల్లగొడుతున్నాడు. అవును.. ఆ రైతు పేరు..  ఉమర్ ‌అక్తర్‌. ఆదిలాబాద్‌ జిల్లా తంతోలికి చెందినవాడు.  కొత్తరకం పంటలపై ఆయనకు ఆసక్తి ఎక్కువ. దీంతో పోయిన ఏడాది ఎకరం విస్తీర్ణంలో బ్రకోలి సాగు చేసిన ఉమర్.. సౌది అరేబియా, దుబాయ్ దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేేశాడు. లాభసాటిగా ఉండటంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం మరో ఎకరా పెంచాడు. అయితే ఈసారి పంటకు మన దగ్గరే డిమాండ్ ఉండటంతో.. అమ్మకాలు షురూ చేసి.. మంచి లాభాలు అందుకుంటున్నాడు. ఆదిలాబాద్‌లోని రైతు బజార్‌లో బ్రకోలి విక్రయిస్తున్నాడు ఉమర్ ‌అక్తర్‌. కేజీ 100 రూపాయలకు అమ్ముతున్నా…కొనేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ఎప్పుడూ అదే పంటల సాగు వల్ల.. ఫలితాలు పెద్దగా ఉండవని.. ఇలా పంట మార్పిడి చేయడం వల్ల లాభాలు పొందవచ్చని రైతు ఉమర్‌ అక్తర్ చెబుతున్నారు.

కాగా తెల్లగోబి కంటే ఇందులో పోషకాలు ఎక్కువ ఉంటాయని సదరు రైతు చెబుతున్నాడు. ఇది మామూలుగా పాలినేషన్​లోనే పండుతుందని… ఒపెన్ పాలినేషన్​లో కూడా పంట వేయొచ్చని వెల్లడించాడు. ఎకరాకు రూ.50 వేల పెట్టుబడి ఖర్చు అవుతుందని.. 100 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు.  ఈ పంటకు ఎక్కువ నీరు అవసరం లేదని.. చలికాలంలో మంచుతోనే పంట పండుతుందని వివరిస్తున్నాడు. అయితే ఈ పంటకున్న మరో స్పెషాలిటీ ఏంటంటే.. అక్టోబర్‌లో పంట నాటకుంటే.. డిసెంబర్​లో కోతకు వస్తుంది. అంటే మూడు నెలల్లోనే రిటన్స్ పొందవచ్చు. కాగా బ్రకొలి తినడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read: డీజేలో ప్లే అయిన ఫేవరెట్ సాంగ్.. మండపంపైనే వరుడు డ్యాన్స్.. వధువు షాక్

రాజమౌళి డైరెక్షన్​ను డామినేట్​ చేసిన హీరో అతనొక్కడే.. కీలక కామెంట్ చేసిన కీరవాణి