Viral Video: డీజేలో ప్లే అయిన ఫేవరెట్ సాంగ్… మండపంపైనే వరుడు డ్యాన్స్.. వధువు షాక్

పెళ్లి అంటేనే సంబరం. బంధుమిత్రులు, స్నేహితులు, సన్నిహితులతో.. ఆ సందడి మాములుగా ఉండదు. పెళ్లిలో ఈ మధ్య డీజే కూడా కామన్ అయిపోయింది.

Viral Video: డీజేలో ప్లే అయిన ఫేవరెట్ సాంగ్... మండపంపైనే వరుడు డ్యాన్స్.. వధువు షాక్
పెళ్లి మండపంపైనే వరుడు డ్యాన్స్
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 10, 2021 | 8:08 PM

పెళ్లి అంటేనే సంబరం. బంధుమిత్రులు, స్నేహితులు, సన్నిహితులతో.. ఆ సందడి మాములుగా ఉండదు. పెళ్లిలో ఈ మధ్య డీజే కూడా కామన్ అయిపోయింది. ఇప్పటికే వధూవరులకు సంబంధించిన డ్యాన్స్ వీడియోలు నిత్యం నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఒక వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇది మాములుగా క్రేజీగా లేదు. ఎందుకంటే మండపంపై కూర్చున్న వరుడు డీజేలో తనకు ఇష్టమైన సాంగ్ ప్లే అవ్వడంతో ఉండబట్టలేకపోయాడు. మండపంపైనే డ్యాన్స్ షురూ చేశాడు. పెళ్లి కూతురు ఆపే ప్రయత్నం చేసినా.. ఆగలేదు. సరాసరి ఆమెనే తీసుకుని డీజే వద్దకు వెళ్లి డ్యాన్స్ షురూ చేశాడు. దీంతో అతిథులు షాకయ్యారు. ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తుంది. నెటిజన్లు వీడియోను లైక్ చేస్తున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో కళ్యాణ మండపం వధూవరులతో పాటు మరికొందరు కూడా కూర్చున్నారు. వివాహానికి సంబంధించిన తంతు కొనసాగుతోంది. ఇంతలో డీజేలో ప్లే అవుతున్న పాట విని వరుడు.. బాడీ మూమెంట్స్ స్టార్ట్ చేశాడు. పెళ్లికూతురు ఆపడంతో.. కాసేపు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఎక్కువసేపు సైలెంట్‌గా ఉండలేక అక్కడే లేచి డ్యాన్స్ షురూ చేశాడు. అంతేకాదు పెళ్లికూతురును కూడా తనతో పాటు డీజే ఫ్లోర్‌కి తీసుకెళ్లాడు.

వీడియో వీక్షించండి…

View this post on Instagram

A post shared by MEMES.BKS?? (@memes.bks)

DJ ఫ్లోర్‌కు చేరుకున్న తర్వాత, వధువు మాత్రం సైలెంట్‌గా నిలబడి ఉంది. కానీ వరుడు తనని తాను మరిచిపోయి డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు లక్ష కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.

Also Read: చిన్నారి ప్రమాణిస్తోన్న కార్ మాత్రమే కాదు.. తన మనసు కూడా చాలా రిచ్.. మనసును కదిలించే వీడియో

రాజమౌళి డైరెక్షన్​ను డామినేట్​ చేసిన హీరో అతనొక్కడే.. కీలక కామెంట్ చేసిన కీరవాణి