Telangana – Devil Terror: అమ్మో దెయ్యం.. ఆ పూజలు చేయాల్సిందే.. విద్యార్థులను ఆగంపట్టిస్తున్న మూఢనమ్మకాలు..

Telangana - Devil Terror: చావు కబురు వింటే చాలు ఆ గూడాలు ఖాళీ అవుతున్నాయి. దెయ్యం పేరు వింటే చాలు అక్కడి బడులు మూతపడుతున్నాయి.

Telangana - Devil Terror: అమ్మో దెయ్యం.. ఆ పూజలు చేయాల్సిందే.. విద్యార్థులను ఆగంపట్టిస్తున్న మూఢనమ్మకాలు..
Devil Fear
Follow us

|

Updated on: Dec 01, 2021 | 5:22 AM

Telangana – Devil Terror: చావు కబురు వింటే చాలు ఆ గూడాలు ఖాళీ అవుతున్నాయి. దెయ్యం పేరు వింటే చాలు అక్కడి బడులు మూతపడుతున్నాయి. ఆదునిక యుగంలోనూ ఆ ఆదివాసీ గిరిగూడాల్లో మూడనమ్మకాలు కోరలు చాస్తున్నాయి. ఆ అపనమ్మకాల దెబ్బకు అక్కడి వారి బంగారు భవిష్యత్తు అర్థాంతరంగా ఆగిపోతోంది. దెయ్యాలు, భూతాలు, ఆత్మలు, ప్రేతాత్మలంటూ విద్యార్థులను బడులకు దూరం చేస్తున్నారు అక్కడి జనాలు‌. అడవుల జిల్లా ఆదిలాబాద్ లో రాజ్యమేలుతున్న మూడనమ్మకాలపై ప్రత్యేక కథనం మీకోసం..

దేవుడు ఉన్నాడన్నది ఎంత నిజమో దెయ్యం ఉందన్నది కూడా అంతే నిజమంటూ వేదాలు వల్లిస్తున్నాయి ఆదివాసీ గ్రామాలు‌. ఆత్మలు ప్రేతాత్మలు అంటూ పిల్లలను బడులకు దూరం చేస్తున్నాయి. తాజాగా జరిగిన ఘటనలే అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి‌. బెబ్బులి ఎదురు పడ్డా జంకని ఆ జనం.. చిన్న అలికిడికే గజగజావణికిపోతున్నారు. చిమ్మ చీకట్లోను ఒంటరిగా మైళ్ల దూరం నడిచే ఆ జనం చీమ చిటుక్కుమన్న భయంతో హడలెత్తిపోతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా మామిడిగూడలోని బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది.

అసలే ఏజెన్సీ ప్రాంతం.. పైగా అమాయక గిరిజనం. ఏదో తెలియని మాయదారి భూతం తమని మింగేస్తుందనే మూడనమ్మకం.. ఇంకో వైపు‌ కేవలం మగవాళ్లు మాత్రమే చనిపోతుండటం.. దీంతో ఊరుకి ఏదో కీడు జరుగుతుందన్న భయంతో గత జూలై నెలలో బేతాల్ గూడ అనే గిరిజన గ్రామం ఊరుకు ఊరే ఖాళీ అయింది. ఈ బేతాల్ గూడ గ్రామంలో మొత్తం 18 ఇండ్లుండగా.. 62 మంది పెట్టా బేడా సర్దేసుకుని పక్క గ్రామాలకు వలస వెళ్లిపోయారు. మా గ్రామానికి మంత్రాలు చేశారని‌.. ఓ భూతం మా గ్రామంలో తిరుగుతుందని.. మగ వాళ్లను మాత్రమే చంపే వింత ఆకారం మా గ్రామంలో సంచరిస్తుందని ఇలా ఎవరికి నచ్చింది వారు నమ్ముతూ కన్నవూరిని వదికి వలసెల్లిపోయారు‌.

తాజాగా ఇదే జిల్లాలోని మామిడిగూడలోని బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలోనూ సేమ్ సీన్. ఇక్కడ కూడా దెయ్యం ఉందంటూ ప్రచారం జరగడంతో 320 కి పైగా విద్యార్థులు ఉన్నపళంగా ఖాళీ చేసి ఇంటికి వెళ్లిపోయారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్న ఆ పాఠశాలలో శాంతి పూజలు నిర్వహించడం ఇప్పుడు వివాదస్పదమవుతోంది‌. హస్టల్ లోని దెయ్యాన్ని తరుముతామంటూ.. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ప్రభుత్వ గిరిజన పాఠశాలలో ప్రభుత్వ నిబందనలకు విరుద్దంగా ఓ తెగకు చెందిన కొందరు వ్యక్తులతో శాంతి పూజలు చేయించడం చర్చనీయాంశం అయింది. అగ్నిప్రమాదంతో కాలిపోయిన హస్టల్ గదిలో ఏకబిగిన ఆరు గంటలు పూజలు చేయడం పలు అనునానాలకు తావిస్తోంది.

దెయ్యాన్ని పోగోట్టాలంటే దేవెర పూజలు చేయకతప్పదు అన్న రేంజ్ లో పూజలు సాగాయని.. ఈ పూజలతో విద్యార్థుల్లో దెయ్యం ఉందన్నది వాస్తవేమోననే నమ్మకం బలపడినట్లైందని.. శాంతి హోమం తరువాత ఆదివాసీ పూజారులు చేసిన కామెంట్స్ సైతం విద్యార్థులను అశాస్త్రీయత వైపు అడుగులు వేయించినట్లైందని అంటున్నారు కొందరు మేదావులు. జనవిజ్ఞాన వేదిక సభ్యులు సైతం దెయ్యాలు , భూతాలు లేవని కార్యక్రమాలు నిర్వహించినా అవేవి ఫలితం ఇవ్వలేదని తెలుస్తోంది. తమ గ్రామాల్లో ఒకరికి మించి మరణాలు వరుసగా సాగితే ఆ గ్రామంలో ఉండవని.. దైవం ఉన్నది ఎంత నిజమో దెయ్యం ఉన్నదన్నమాట కూడా అంతే నిజమంటున్నారు వీరు‌. ప్రపంచం చంద్రునిపై ఆవాసం కోసం ప్రయత్నిస్తుంటే.. ఇక్కడ మాత్రం అడవివాసీ ఇంకా అపనమ్మకాల చట్రంలో బందీ అయి సాగుతున్నడన్నది వాస్తవం.

Also read:

మందుబాబుల మత్తు వదల కొడతాం..ఇల్లీగల్ డీ అడిక్షన్‌ రీహాబిలిటేషన్‌ సెంటర్ల అక్రమ దందా.. టీవీ9 నిఘాలో విస్తుకొలిపే నిజాలు!

Business Idea: వాటే ఐడియా గురూ.. తండ్రి ఆసక్తి.. తనయుని వ్యాపారం.. కోట్లాది రూపాయల టర్నోవర్..

Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్ వేవ్ వస్తుందా? కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ అంచనా..