Hyderabad: ”ఈనెల 25న నా పెళ్లి ఉంది సార్”.. జైలుకెళ్లనుంటూ మొండికేసిన నిందితుడు
హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో ఓ నిందితుడు రెచ్చిపోయాడు. ఈ నెల 25 తన పెళ్లి ఉందని.. జైలుకు వెళ్లనంటూ నానా హంగామా చేశాడు. ఏకంగా కోర్టు లోపల తలుపుకు ఉన్న అద్దాలు పగలగొట్టాడు. దీంతో ఈ నిందితుడి చేతికి గాయాలు కూడా అయ్యాయి.
![Hyderabad: ''ఈనెల 25న నా పెళ్లి ఉంది సార్''.. జైలుకెళ్లనుంటూ మొండికేసిన నిందితుడు](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/06/nampally-court.jpg?w=1280)
హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో ఓ నిందితుడు రెచ్చిపోయాడు. ఈ నెల 25 తన పెళ్లి ఉందని.. జైలుకు వెళ్లనంటూ నానా హంగామా చేశాడు. ఏకంగా కోర్టు లోపల తలుపుకు ఉన్న అద్దాలు పగలగొట్టాడు. దీంతో ఈ నిందితుడి చేతికి గాయాలు కూడా అయ్యాయి. అసలేం జరిగిందంటే ఆనంద్ అగర్వాల్ అనే వ్యక్తి ఓ రౌడి షీటర్. ఇప్పటికే అతనిపై దాదాపు 18 కేసులు నమోదయ్యాయి. ఇటీవలే ఓ గంజాయి కేసులో అతడ్ని శాలిబండ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
అయితే కేసు విచారించేందుకు న్యాయస్థానం అతడికి రిమాండ్ విధించింది. దీంతో ఆనందర్ అగర్వాల్ తనకు ఇటీవలే పెళ్లి కుదిరిందని ఈనెల 25 న జరగనుందని చెప్పాడు. జైలుకు వెళ్లనంటు మొండికేశాడు. ఆ తర్వాత కోపంతో కోర్టు లోపల ఉన్న డోర్ అద్దాలు ధ్వంసం చేశాడు. ఇదిలా ఉండగా అగర్వాల్‌పై గతంలో కూడా పలు గంజాయి కేసులు నమోదయ్యాయి. దొంగతనం కేసు ఒక మర్డర్ కేసులో కూడా అతను నిందితుడిగా ఉన్నాడు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే నెల క్రితమే ఓ హత్య కేసులో అతను జైలుకెళ్లి విడుదలవ్వడం గమనార్హం.
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/06/ibps-rrb-recruitment.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/06/husband-kills-wife-in-gujarat.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/06/viral-video.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/06/hyderabad-crime-news-1.jpg)
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..