Khammam: రక్తసిక్తంగా మారిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం.. ఒకరు మృతి.. మరికొందరికి తీవ్రగాయాలు..

ఖమ్మం జిల్లా కారేపల్లిలో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం రక్తసిక్తంగా మారింది. ఎమ్మెల్యే రాములూనాయక్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

Khammam: రక్తసిక్తంగా మారిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం.. ఒకరు మృతి.. మరికొందరికి తీవ్రగాయాలు..
BRS Wyra
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 12, 2023 | 1:51 PM

ఖమ్మం జిల్లాలోని కారేపల్లిలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం రక్తసిక్తంగా మారింది. కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్‌ కార్యకర్తల అత్యుత్సాహంతో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే రాములూనాయక్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో కార్యకర్తలు బాణసంచా పేల్చడంతో ఓ గుడిసెపై పడి మంటలు అంటుకున్నాయి. గుడిసెకు అంటుకున్న మంటలు వ్యాపించి గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒకరు మృతి చెందారు. పలువురు తీవ్రగాయాలపాలయ్యారు. గాయపడ్డ వారిలో స్థానికులు, కార్యకర్తలు, పోలీసులు, జర్నలిస్టులు ఉన్నట్లు పేర్కొంటున్నారు. గాయపడ్డవారిని హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒక్కసారిగా గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో మంటలు ఎగసిపడ్డాయి. అగ్నిప్రమాదంతో అక్కడున్నవారు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఉరుకులు, పరుగులు తీశారు. ఘటనాస్థలంలో బీతావహ పరిస్థితులు నెలకొన్నాయి.

సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి..

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల బిఆర్ఎస్ అధినేత సిఎం కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో వూహించని రీతిలో సిలిండర్లు పేలి ఇద్దరు కార్యకర్తలు మరణించడం, పలువురికి తీవ్ర గాయాలు పాలయ్యారని తెలిసిన వెంటనే ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కి, ప్రమాదం జరిగిన ప్రాంతంలో వున్న ఎంపీ నామా నాగేశ్వర్ రావులకు ఫోన్లు చేసి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సిఎం భరోసా ఇచ్చారు. తాము అండగా వుంటామని స్పష్టం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశించారు.

Wyra

ఇవి కూడా చదవండి

Wyra

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!