Balagam Mogilaiah: బలగం మొగిలయ్యకు నిమ్స్‌లో కొనసాగుతున్న చికిత్స..వైద్యులు ఏమన్నారంటే
బలగం మొగిలయ్యకు నిమ్స్ లో చికిత్స కొనసాగుతోంది. ఆయనకు ఛాతి నొప్పి రావడంతో ముందుగా వరంగల్ ఆసుపత్రికి తరలించిన వైద్యులు తాజాగా హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
బలగం మొగిలయ్యకు నిమ్స్ లో చికిత్స కొనసాగుతోంది. ఆయనకు ఛాతి నొప్పి రావడంతో ముందుగా వరంగల్ ఆసుపత్రికి తరలించిన వైద్యులు తాజాగా హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే మొగిలయ్య దీర్ఘకాలికంగా డయాబెటీస్, బీపీ సమస్యలతో బాధపడుతున్నారు. గత ఏడాది ఆయనకు రెండు కిడ్నీలు చెడిపోవడంతో అప్పటి నుంచి డయాలసిస్ తోనే నడిపిస్తున్నారు . ప్రస్తుతం మొగిలయ్యకు అన్ని పరీక్షలు చేసిన తర్వాత గుండె సమస్య లేదని నిమ్స్ వైద్యులు నిర్ధారించారు. డయాలిసిస్ కొనసాగిస్తూనే చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం మొగిలయ్య ఆరోగ్యం నిలకడగానే ఉందని..ఆహారం కూడా తీసుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
ఇవి కూడా చదవండి