AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaleshwaram: థాయ్‌లాండ్‌లో కొడుకు పెళ్లి.. కథ మామూలుగా లేదుగా! ఏసీబీ కస్టడీకి నూనె శ్రీధర్‌..

కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. రూ.200 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించిన తర్వాత ఐదు రోజుల కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేసి, కోర్టు అనుమతితో అరెస్టు చేశారు. శ్రీధర్ నివాసం, కార్యాలయాలపై సోదాలు నిర్వహించి విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.

Kaleshwaram: థాయ్‌లాండ్‌లో కొడుకు పెళ్లి.. కథ మామూలుగా లేదుగా! ఏసీబీ కస్టడీకి నూనె శ్రీధర్‌..
Nune Sridhar And Acb
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Jun 20, 2025 | 10:39 AM

Share

కాళేశ్వరం ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ను కస్టడీకి తీసుకొని విచారించనున్నారు ఏసీబీ అధికారులు. కరీంనగర్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నటువంటి శ్రీధర్ నివాసం కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు పది రోజుల క్రితం సోదాలు నిర్వహించి రూ.200 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు. అంతేకాకుండా కుమారుడి వివాహం థాయిలాండ్‌లో చేయగా రిసెప్షన్ హల్దీ ఫంక్షన్స్ రిసాట్లల్లో పలు హోటల్స్ లలో నిర్వహించారు.

అధికారులు గుర్తించినటువంటి ఆస్తుల్లో తెల్లాపూర్ లోని విల్లా షేక్పేట్ లో గేటెడ్ కమ్యూనిటీ హాల్లో ప్లాట్, అమీర్‌పేట్‌లో కమర్షియల్, కాంప్లెక్స్ కరీంనగర్‌లో మూడు ప్లాట్లు, హైదరాబాద్‌ వరంగల్ కరీంనగర్లలో మూడు భవనాలు, 16 ఎకరాల భూమి, 19 ఇళ్ల స్థలాలు, రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను గుర్తించారు. ఈ విధంగా పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్రీధర్‌ను కస్టడీకి తీసుకొని విచారిస్తే చాలా అంశాలు బయటపడే అవకాశం ఉంటుందని భావించిన అధికారులు ఏసీబీ కోర్టులో ఐదు రోజులపాటు కస్టడీ పిటీషన్ను దాఖలు చేశారు. ఏసీబీ కోర్టు అందుకుగాను ఐదు రోజుల పాటు కస్టడీని అధికారులకు ఇచ్చింది. ఈ రోజు ఉదయం శ్రీధర్ను కస్టడీకి తీసుకొని ఐదు రోజులు పాటు విచారించరున్నారు ఏసీబీ అధికారులు.

ఈ నేపథ్యంలో కాలేశ్వరంలో కీలక బాధ్యతలు చూసినటువంటి నూనె శ్రీధర్ సంవత్సరం పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్ఫర్ చేసిన అక్కడే ఉండి పనిచేయడం, అందుకుగాను కాలేశ్వరంలో పనిచేస్తున్న ఈఎంసి అనిల్ ఆదేశాల మేరకే అక్కడ ఉండి పనిచేసినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే అనిల్‌కు ఎవరు ఆదేశాలు జారీ చేశారు? ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్ఫర్ చేసినా ఎందుకు అక్కడే పని చేశారు? ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా జరిగిందని కోణంలో ఏసీబీ అధికారులు విచారించబోతున్నారు. మరోవైపు బ్యాంకు లాకర్‌ సైతం కూడా తెరిచి శ్రీధర్ ఆస్తుల చిట్టాను బయటపెట్టే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి