Yoga Day 2025: ఎల్బీ స్టేడియంలో యోగా డే కౌంట్ డౌన్ షురూ.. లైవ్ వీడియో..
యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని.. ప్రపంచానికి మోదీ ఇచ్చిన బహుమతి యోగాడే అంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎల్బీస్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను శనివారం (జూన్ 21) ఘనంగా నిర్వహించనున్నట్టు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 24 గంటల ముందు కౌంట్ డౌన్ మహోత్సవాన్ని శుక్రవారం ప్రారంభించారు.
యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని.. ప్రపంచానికి మోదీ ఇచ్చిన బహుమతి యోగాడే అంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎల్బీస్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను శనివారం (జూన్ 21) ఘనంగా నిర్వహించనున్నట్టు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 24 గంటల ముందు కౌంట్ డౌన్ మహోత్సవాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ వేడుకల్లో ప్రముఖ యోగా సంస్థలు, విద్యాసంస్థలు, సామాజిక సంస్థలు భాగస్వామ్యం అయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అలాగే.. ప్రముఖ నటినటులు సాయిధరమ్‌తేజ్ ఖుష్బూ, మీనాక్షి చౌదరి సైతం హాజరయ్యారు. ఈ కార్యక్రమంతో రేపటి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి, ప్రముఖులు యోగా చేశారు. యోగా డేను పురస్కరించుకొని ఇక్కడ ఆసనాలు వేశారు.
జూన్ 21న (శనివారం) ప్రపంచ వ్యాప్తంగా యోగా డే నిర్వహించబోతున్నారు. 2014లో ప్రధాని మోదీ కృషి ఫలితంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఏటా జూన్ 21న యోగా డే జరుపుకుంటున్నాం.. ఇది 11వ ఏడాది.. 2015 జూన్ 21న న్యూఢిల్లీలో జరిగిన భారీ కార్యక్రమంలో, మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులను సాధించింది. యోగా మన ప్రాచీన సంప్రదాయం నుంచి వచ్చిన అమూల్యమైన బహుమతి. యోగా మనసు, శరీరం, ఆలోచన, క్రియల ఐక్యతను సూచిస్తుంది. ఇది మన ఆరోగ్యం, శ్రేయస్సుకు విలువైన సంపూర్ణ విధానం అన్నది ప్రధాని మోదీ ఆలోచన.. కాగా.. యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ థీమ్‌తో ఈ ఏడాది యోగా డే నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది వేడుకల్లో 10 ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి.

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?

ముద్దులొలికే ఈ చిన్నారి ఫోటో వెనుక.. అంతులేని విషాదం వీడియో

రన్నింగ్ చేస్తేనే శాలరీతో పాటు బోనస్ వీడియో

సర్కారు ఆఫీసుకు దిష్టి.. పోవటానికి ఏం చేసారో తెలుసా

చోరీకి వెళ్లిన ఇంట్లోనే 3 రోజులు మకాం వేసిన దొంగ.. ఆ తర్వాత
