AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయంటే..?.. ఆరా మస్తాన్ సర్వే

తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే TRSకే ఆధిక్యత వస్తుందని చెప్పారు ఆరా సర్వే సంస్థ నిర్వాహకులు మస్తాన్‌. ఇటీవల తమ సంస్థ పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతోందని, అదంతా తప్పని చెప్పారు.

Telangana: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయంటే..?.. ఆరా మస్తాన్ సర్వే
Telangana Politics
Ram Naramaneni
|

Updated on: Jul 13, 2022 | 4:25 PM

Share

తెలంగాణలో ఓ పక్కన ఎడతెరపి లేని వానలతో చల్లటి వెదర్ నడుస్తుంటే.. రాజకీయాలు మాత్రం చాలా హాట్‌హాట్‌గా నడుస్తున్నాయి. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటలు కాదు.. సవాళ్ల యుద్ధమే నడుస్తుంది. ముందస్తు ఎన్నికల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుంది. ఈ క్రమంలో తాజాగా ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ హెడ్  మస్తాన్ చేసిన కామెంట్స్ ప్రకంపనలు రేపుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కే ఆధిక్యం సాధిస్తుందని ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్‌కు 38.88 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే( 46.87శాతం) ఆ పార్టీకి ఓటింగ్  8 శాతం తగ్గిందని తెలిపారు. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే బీజేపీకి 30.48 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశారు.  కాంగ్రెస్‌కు 23.71 శాతం వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇతరులకు 6.93 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని మస్తాన్ పేర్కొన్నారు.

తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే TRSకే ఆధిక్యత వస్తుందని స్పష్టం చేశారు ఆరా సర్వే సంస్థ నిర్వాహకులు మస్తాన్‌. ఇటీవల తమ సంస్థ పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతోందని, అదంతా తప్పని చెప్పారు. ఇప్పటికీ TRS ఆధిక్యంలోనే ఉందని స్పష్టం చేశారు. అయితే బీజేపీ ఓటు షేర్‌ పెరుగుతుందని వివరించారు.ఆంధ్ర సెటిలర్స్ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని.. ఇక్కడ నివశిస్తున్న నార్త్ ఇండియన్స్ 80 శాతం బీజేపీ వైపే ఉన్నారని చెప్పారు.

సర్వే రిపోర్ట్ పూర్తి వివరాల కోసం దీనిపై క్లిక్ చేయండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి