AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అందరికీ ఈమెలా అదృష్టం ఉండకపోవచ్చు.. వైరల్‌ అవుతోన్న సజ్జనార్ ట్వీట్‌.

ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతోన్నా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు భద్రతా నియమాలను పాటించకపోవడం వల్లే చాలా వరకు ప్రమాదాలు జరుగుతాయనే విషయం తెలిసినా.. త్వరగా గమ్యాన్ని చేరుకోవాలనో, మరే కారణమో కానీ ప్రమాదాలను..

Watch Video: అందరికీ ఈమెలా అదృష్టం ఉండకపోవచ్చు.. వైరల్‌ అవుతోన్న సజ్జనార్ ట్వీట్‌.
Viral Video
Narender Vaitla
|

Updated on: Feb 24, 2023 | 8:50 AM

Share

ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతోన్నా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు భద్రతా నియమాలను పాటించకపోవడం వల్లే చాలా వరకు ప్రమాదాలు జరుగుతాయనే విషయం తెలిసినా.. త్వరగా గమ్యాన్ని చేరుకోవాలనో, మరే కారణమో కానీ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. కొన్నిసార్లు తెలిసి చేసిన తప్పులే ప్రాణాల మీదికి తీసుకొస్తాయి. అయితే అదృష్టం బాగుంటే ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడతారు. లేదంటే న్యూస్‌ హెడ్‌ లైన్స్‌లో నిలుస్తుంటారు.

తాజాగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనర్ షేర్‌ చేసిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఓ మహిళ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న వీడియో ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. రోడ్డుపై ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. అదే సమయంలో ఓ యువతి స్కూటీపై వెళుతోంది. అయితే తొందరగా వెళ్లాలన్నా ఆతృతతో ఆగి ఉన్న పెద్ద ట్రక్‌ను క్రాస్‌ చేసి ముందుకు వెళ్లింది. దీంతో అప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ పడడంతో లారీ డ్రైవర్‌ ఒక్కసారిగా వెహికిల్‌ను మూవ్‌ చేశాడు.

ఇవి కూడా చదవండి

దీంతో లారీ కాస్త మహిళ స్కూటిని ఢీకొట్టి ఆమె పై నుంచి వెళ్లిపోయింది. అయితే అదృష్టవశాత్తు సదరు యువతి ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకుంది. ఇదంతా వెనకాల వాహనంలో ఉన్న ఓ వ్యక్తి వీడియోగా తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో అటు తిరిగి, ఇటు తిరిగి సజ్జనార్‌ కంట్లో పడింది. దీంతో ఈ వీడియోను ట్వీట్‌ చేసిన సజ్జనర్.. ‘అందరికీ ఈమెలా అదృష్టం వరించదు! ద్విచక్రవాహనదారులారా..! లేన్ డ్రైవింగ్ ను పాటించండి. రోడ్డుపై బైక్ తో అడ్డదిడ్డంగా వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి’ అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Follow Us