AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నేటి నుంచి శనగల కొనుగోళ్లు ప్రారంభం.. అర్ధరాత్రి నుంచి చలిలో టోకెన్ల కోసం ఎదురుచూస్తున్న రైతులు

శనగల కొనుగోళ్ల కు సంబంధించిన టోకెన్లను ఈ ఉదయం నుండి  పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు.  దీంతో చలిని సైతం లెక్కచేయకుండా రాత్రి నుంచి క్యూలైన్ లో టోకెన్ల కోసం ఎదురుచూస్తున్నారు రైతులు. చలి మంటలు కాగుతూ టోకెన్ల కోసం పడిగాపులుకాస్తున్నారు. 

Telangana: నేటి నుంచి శనగల కొనుగోళ్లు ప్రారంభం.. అర్ధరాత్రి నుంచి చలిలో టోకెన్ల కోసం ఎదురుచూస్తున్న రైతులు
Chickpea Crop
Surya Kala
|

Updated on: Feb 24, 2023 | 8:41 AM

Share

నిర్మల్ జిల్లాలో మార్క్‌‌‌‌ఫెడ్, పీఏసీఎస్‌‌‌‌ల ఆధ్వర్యంలో శనగ కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి. అయితే ఆదిలో విమర్శల పాలవుతుంది. రైతులు టోకెన్ల కోసం అర్థరాత్రి‌ నుండి కోనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. చలిని సైతం లెక్కచేయకుండా రైతులు కొనుగోలు కేంద్రం వద్ద బారులు తీరారు. ఒక్కో కేంద్రంలో కేవలం 5 వందల క్వింటాళ్ల కందుల కోనుగోలుకు మాత్రమే టోకెన్ల జారీ చేయనుండడంతో.. రైతులు రాత్రి నుండి క్యూ లైన్లలో ఎదురుచూస్తున్నారు.

జిలాల్లోని నిర్మల్ , బైంసా డివిజన్లలో శనగ కొనుగోళ్లు ప్రారంభంకానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 8 కేంద్రాలలో మార్క్ పెడ్ ద్వారా శనగ కొనుగోళ్లు చేయనున్నారు. తానూర్ మండల కేంద్రంలోని పిఏసీఎస్ గోదాం ముందు శనగ టోకెన్ ల కోసం రాత్రి నుంచి బారులు తీరారు. సుమారు 500 మంది రైతులు తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. బాసర శనగ కొనుగోలు కేంద్రంలో 300 మంది రైతుల ఎదురుచూస్తున్నారు. శనగల కొనుగోళ్ల కు సంబంధించిన టోకెన్లను ఈ ఉదయం నుండి  పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు.  దీంతో చలిని సైతం లెక్కచేయకుండా రాత్రి నుంచి క్యూలైన్ లో టోకెన్ల కోసం ఎదురుచూస్తున్నారు రైతులు. చలి మంటలు కాగుతూ టోకెన్ల కోసం పడిగాపులుకాస్తున్నారు.

ఈరోజు ఉదయం 9 గంటల నుండి శనగల టోకెన్ ల పంపిణీ చేయనున్నారు నిర్వహకులు. బాసర, తానూర్ కేంద్రాలకు శనగ కొనుగోలు టోకెన్ల కోసం  సుమారు 30 గ్రామాల నుంచి రైతులు చేరుకున్నారు. నిర్మల్ జిల్లాలో ఈ ఏడాది అత్యధికంగా శనగల సాగు చేస్తారు. ఈ ఏడాది శనగలు అధిక దిగుబడి ఇచ్చిన సంగతి తెలిసిందే. క్వింటాలుకు 5335 రూ ధర పలుకుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us