TG EAPCET 2026 Admit Card: తెలంగాణ ఈఏపీసెట్ హాల్ టికెట్లు వచ్చేశాయ్.. డౌన్‌లోడ్ లింక్ ఇదే
TS EAMCET 2026 Hall Ticket Download: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ 2026 హాల్‌టికెట్లు ఏప్రిల్ 23 విడుదల అయ్యాయి. ఏప్రిల్ 27వ తేదీ మధ్యాహ్నం వరకు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

హైదరాబాద్, ఏప్రిల్ 23: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ 2026 హాల్‌టికెట్లు ఏప్రిల్ 23 విడుదల అయ్యాయి. ఏప్రిల్ 27వ తేదీ మధ్యాహ్నం వరకు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈఏపీసెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ ఈఏపీసెట్ 2026 హాల్ టికెట్ల డౌన్ లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇప్పటి వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు 2,10,308 మంది, అగ్రికల్చర్ విభాగానికి 90,569 మంది దరఖాస్తు చేశారు. రెండు విభాగాలకు సంబంధించి 317 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా ఈ ఏడాది ఈఏపీ సెట్‌కు మొత్తం 3,01,194 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఏప్రిల్ 4తో ఆలస్య రుసుములేకుండా దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులురూ.5000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.10 వేల ఆలస్య రుసుముతో మే 2 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇక అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలు మే 4, 5 తేదీల్లో జరగనున్నాయి. ఇంజినీరింగ్ పరీక్షలు మే 9, 10, 11 తేదీల్లో జరగనున్నాయి.
తెలంగాణ ఈఏపీసెట్ 2026 హాల్ టికెట్ల డౌన్ లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




