నేషనల్ లెవల్లో ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ రెమ్యునరేషన్
అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్ కాకుండా, లాభాల వాటా పద్ధతిని అనుసరిస్తున్నారు. సినిమా లాభాల్లో 30 శాతం తీసుకుంటూ, నిర్మాతలకు భారం తగ్గిస్తున్నారు. ఈ వినూత్న స్ట్రాటజీ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ట్రెండింగ్‌లో ఉన్న విషయం. అల్లు అర్జున్‌కు ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్ అనేది ఉండదట. అసలు నిర్మాతలతో ఆయన డబ్బుల సంగతే మాట్లాడరని ప్రచారం జరుగుతోంది. తాను నిర్మాత గారి అబ్బాయిని కాబట్టి నిర్మాతల కష్టాలు తనకు తెలుసని ఆయన కెరీర్ ఆరంభం నుంచీ చెబుతూ వస్తున్నారు. అందుకే ప్రాఫిట్ షేరింగ్ పద్ధతికే ఓటు వేశారంటున్నారు.ఆయన అనుసరిస్తున్న ఫార్ములా “రూపాయికి 30 పైసలు”. అంటే సినిమా 1000 కోట్లు వసూలు చేస్తే, 300 కోట్లు అల్లు అర్జున్ ఖాతాలోకి వస్తాయి. ఒకవేళ 500 కోట్లు చేస్తే, 150 కోట్లతో తృప్తి పడతారట. ఈ పద్ధతి వల్ల నిర్మాతలకు సగం భారం తగ్గిపోతుందని మేకర్స్ చెబుతున్నారు. అల్లు అర్జున్ బాటలో ఇంకెంతమంది నడుస్తారో చూడాలని సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
సడన్‌గా సైలెంట్ అయిన డార్లింగ్.. రీజనేంటి?
పూరి @26..మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారా..?
పాన్ ఇండియా హిట్ వరమా..శాపమా?
ఊరిస్తున్న ఒక్క పాట.. పెద్ది టీమ్ ప్లానేంటి?
సమ్మర్ హీట్.. లైట్ అంటున్న స్టార్స్
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

