AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Astrology: రెండు ధన యోగాలు.. ఆ రాశుల వారికి భోగభాగ్యాలు, డబ్బు వర్షం!

చంద్రుడు రాశి మారినప్పుడల్లా జీవితంలో ఒకటో రెండో మార్పులు చేసుకుంటాయి. చంద్రుడు అనుకూలంగా సంచారం చేస్తున్నవారికి మనసులోని కోరికలు నెరవేరడమో, మానసిక ప్రశాంతత లభించడమో, సుఖ సంతోషాలు కలగడమో తప్పకుండా జరుగుతుంది. ఈ నెల(ఏప్రిల్) 28, 29, 30 తేదీ లలో చంద్రుడు కన్యారాశిలో సంచారం చేస్తున్నప్పుడు కుజ, గురువుల కేంద్ర స్థితి వల్ల ఏక కాలంలో చంద్ర మంగళ యోగం, గజకేసరి యోగం ఏర్పడతాయి. వీటి వల్ల వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం రాశుల వారికి రాజయోగాలు, మహా భాగ్య యోగాలు కలిగే అవకాశం ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 23, 2026 | 1:25 PM

Share
వృషభం: ఈ రాశికి ఈ చంద్ర యోగాల వల్ల సిరిసంపదలు వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యు లేషన్లు బాగా లాభించడంతో పాటు లాటరీ యోగం కలిగే అవకాశం కూడా ఉంది. కొద్ది ప్రయత్నంతో సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆస్తి వివాదాలు తేలికగా పరిష్కారమై, భూలాభం కలుగుతుంది. ఉద్యోగంలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.

1 / 6
మిథునం: ఈ రాశికి ఈ చంద్ర మంగళ, గజకేసరి యోగాల వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభిస్తుంది. ఆస్తి లాభం, భూలాభం కలుగుతాయి. ఆస్తి సమస్యలు, వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తి విలువ బాగా పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

2 / 6
కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడికి కుజ, గురువుల కేంద్ర స్థితి వల్ల చంద్ర మంగళ, గజకేసరి యోగాలు ఏర్పడడం వల్ల అనేక మార్గాల్లో సంపద వృద్ధి చెందుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. ఆదాయ వృద్ది కోసం ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు వరిస్తాయి. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభించి జీతభత్యాలు పెరగడం, పదోన్నతి లభించడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరిగి, రాబడి అధికమవుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.

3 / 6
కన్య: ఈ రాశికి సప్తమ, దశమ స్థానాల్లో చంద్ర మంగళ, గజకేసరి యోగాలు ఏర్పడుతున్నందు వల్ల వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. దీనివల్ల ఆదాయం బాగా పెరు గుతుంది. నిరుద్యోగులకు విదేశాల్లో అవకాశాలు లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై భూలాభం కలుగుతుంది.

4 / 6
వృశ్చికం: రాశ్యధిపతి కుజుడితోనూ, ధనాధిపతి గురువుతోనూ భాగ్యాధిపతి చంద్రుడికి రెండు శుభ యోగాలు ఏర్పడడం వల్ల ఈ రాశివారి ఆదాయ వృద్ధికి అనేక అవకాశాలు లభిస్తాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ఆదాయ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ధన ధాన్య సమృద్ధికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.

5 / 6
మకరం: ఈ రాశికి సప్తమాధిపతి అయిన చంద్రుడితో రెండు మహా భాగ్య యోగాలు ఏర్పడడం వల్ల ఊహించని మార్గంలో సంపద కలిసి వచ్చే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ఆదాయపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వారసత్వ సంపద లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

6 / 6
Follow Us