కంగన స్పీచ్‌లో సౌత్ టాపిక్… ఇప్పుడెందుకు?
కంగన రనౌత్ సౌత్ సినిమాలను, వాటిలోని ప్రాంతీయతను ప్రశంసించారు. ఉత్తరాది ప్రేక్షకులు సినిమాలకు దూరమయ్యారని ఆమె అభిప్రాయపడ్డారు. ఒరిజినల్ కంటెంట్‌పై మేకర్స్ దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు. పని గంటలు వ్యక్తిగత విషయమని, హాలీవుడ్లో నటించాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు.
బాలీవుడ్ నటి కంగన రనౌత్ తన బోల్డ్ వ్యాఖ్యలతో తరచు వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల ఆమె సౌత్ సినిమాలపై, ఒరిజినల్ కంటెంట్‌పై, పని గంటలపై, హాలీవుడ్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. సౌత్ సినిమాలను ప్రశంసిస్తూ, అక్కడి మేకర్స్ తమ సంస్కృతిని, ప్రాంతీయతను విడిచిపెట్టకుండా సినిమాలు తీస్తున్నారని, అందుకే విజయవంతం అవుతున్నారని కంగన అన్నారు. ఉత్తరాది ప్రేక్షకులు సినిమాలతో డిస్కనెక్ట్ అయ్యారని ఆమె గతంలో చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు.ఇలాంటి ఒరిజినల్ కంటెంట్‌పై మేకర్స్ దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. రీసెంట్గా ఉత్తరాదిలో విడుదలైన దురంధర్ వంటి కంటెంట్ ప్రజలకు చేరువవుతుండడం ఆనందంగా ఉందని కంగన తెలిపారు. పని గంటల గురించి మాట్లాడుతూ, ఎంతసేపు పని చేయాలనేది వ్యక్తిగత విషయమని ఆమె అన్నారు. దీపిక పదుకొణె ఉదాహరణను ప్రస్తావిస్తూ, బిడ్డకు జన్మనిచ్చాక ఆమె పని గంటల విషయంలో నియమాలు పెట్టుకోవడం తప్పు కాదని కంగన పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
సడన్‌గా సైలెంట్ అయిన డార్లింగ్.. రీజనేంటి?
పూరి @26..మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారా..?
పాన్ ఇండియా హిట్ వరమా..శాపమా?
పిల్లలు లేరని భార్యను వేధించాడు.. అంతే.. భర్తను కత్తితో పొడిచి..
పుష్ప సినిమాకు మించిన స్కెచ్.. మామూలుగా లేదుగా!
వరదకు కొట్టుకొచ్చిన 23 కేజీల బాహుబలి చేప..
నాగుల చవితి పర్వదినాన ఆలయంలో అద్భుతం..
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..

