Tamil Nadu Election 2026: ఓటేసిన సెలబ్రెటీలు.. తమిళనాట కొనసాగుతున్న పోలింగ్
తమిళనాట 2026 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈరోజు, గురువారం ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 7 గంటలకు అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈసారి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య రికార్డు స్థాయిలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల నుండి మొత్తం 4,023 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ బూత్‌ల వద్ద పొడవైన బారులు తీరాయి. పోలింగ్ ప్రక్రియ తమిళనాట సజావుగా జరుగుతుంది. పోలీసులు భారీ బందోబస్త్ ను ఏర్పాటు చేశారు. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచే పలువురు సెలబ్రెటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి ఎన్ని కల్లో పోటీ చేస్తున్న దళపతి విజయ్ చెన్నై పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఓటువేశారు. వీరితోపాటు స్టార్ హీరో అజిత్, స్టార్ డైరెక్టర్ అట్లీ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రాజకీయ, సినీ ప్రముఖులు సైతం పోలింగ్ బూతుల్లో క్యూ కట్టి ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు జరుగుతున్న పోలింగ్‌కు గానూ 4,023 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈసారి దళపతి విజయ్ పోటీ చేస్తుండటంతో అక్కడి రాజకీయం రసవత్తరంగా మారింది.
భార్యతో కలిసి ఓటువేయడానికి వచ్చిన హీరో శివకార్తికేయన్
Hero #Sivakarthikeyan voted along with his wife.#TamilNaduElections #2026TNElections #TVKVijay pic.twitter.com/fatQeQeULK
— Milagro Movies (@MilagroMovies) April 23, 2026
ఓటు వేసి ఇంక్ మార్క్ చూపిస్తున్న దర్శకుడు అట్లీ
Direcor #Atlee awaited his turn and cast his vote for the Tamil Nadu Assembly Elections. #TamilNaduElections #TNElections2026 pic.twitter.com/OuPbT5l2cL
— Chennai Times (@ChennaiTimesTOI) April 23, 2026
ఓటు వేసిన హీరో అజిత్ ..
Actor #Ajith proudly showcases his inked finger after fulfilling his civic duty by voting in the Tamil Nadu Assembly Elections 2026! #TamilNaduElections #TNElections2026 pic.twitter.com/xspN6p2KVD
— Chennai Times (@ChennaiTimesTOI) April 23, 2026
ఓటు హక్కు వినియోగించుకున్న నటి త్రిష
Actress #Trisha fulfills her duty by voting in Alwarpet with her mother in the Tamil Nadu Assembly Elections!#TamilNaduElections #TNElections2026 pic.twitter.com/6yeAMUi8zv
— Chennai Times (@ChennaiTimesTOI) April 23, 2026
ఓటు హక్కు వినియోగించుకున్న ఇళయ రాజా..
Music Maestro #Ilaiyaraaja took a moment to fulfill his civic duty by casting his vote in the Tamil Nadu Assembly Elections! #TamilNaduElections #TNElections2026 pic.twitter.com/TKU8QwSIiv
— Chennai Times (@ChennaiTimesTOI) April 23, 2026
ఓటువేసి దళపతి విజయ్
Thalapathy @actorvijay casts his vote. 🗳️#TVKVijay #TamilNaduElections pic.twitter.com/s12Pi1PBfB
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) April 23, 2026




