AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం కొనే వారికి సూపర్ గుడ్‌న్యూస్.. జస్ట్‌ 4 గంటల్లోనే భారీగా తగ్గిన ధరలు, తులం ఎంతంటే?

Gold Silver Rate Today : అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చేసుకుంటున్నాయి. గడిచిన రెండు మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ ఒక్కసారిగా పడిపోయాయి. జస్ట్‌ కొన్ని గంటల్లో బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు కనిపించాయి. కాబట్టి ప్రస్తుతం దేశీయ మార్కెట్, హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Anand T
|

Updated on: Apr 23, 2026 | 10:34 AM

Share
పశ్చిమాసియా ఉద్రిక్తల మధ్య బంగారం, వెండి ధరల్లో వరుస హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా గురువారం ఉదయం 6గంటల నుంచి 10 గంటల మధ్య అంటే జస్ట్‌ 4 గంటల్లోనే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.1200పైగా తగ్గింది. అటు వెండి కూడా రూ.5వేలు దిగొచ్చింది. కాబట్టి ప్రస్తుతం హైదరాబాద్‌ సహా దేశ వ్యాప్తంగా ఉన్న బంగారం, వెండి ధరలు పరిశీలిద్దాం.

1 / 5
భారీ హెచ్చుతగ్గుల తర్వాత ప్రస్తుతం హైదారబాద్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్చమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,550 వద్ద కొనసాగుతుండగా ఉదయం 6గంటలకు ఈ ధర 1,54,740గా ఉంది. అంటే కేవలం 4 గంటల్లోనే తులం బంగారంపై ఏకంగా రూ.1200పైగా దిగొచ్చింది. ఇక 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే ఉదయంతో పోల్చుకుంటే దీని ధర రూ.1100 తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగాం ధర రూ.1,40,750 వద్ద కొనసాగుతుంది.

2 / 5
ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల స్వచ్చమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,550గా ఉండగా ఉదయం ఈ ధర రూ. 1,54,740గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగాం ధర  రూ.1,40,750 వద్ద కొనసాగుతుంది. ఇక్కడే కాదు దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలైన ముంబై, పూణె, బెంగళూరులోనూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ధరలే కొనసాగుతున్నాయి.

3 / 5
ఇక దేశ రాజధాని ఢిల్లీలో  24 క్యారెట్ల స్వచ్చమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,700 వద్ద కొనసాగుతుండగా ఉదయం 6గంటలకు ఈ ధర 1,54,890 గా ఉంది. అటు చెన్నైలోనూ తులం బంగారం ధర రూ.1,54,480 వద్ద కొనసాగుతుంది. ఇక్కడితో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే బంగారం దిగుమతి చేసుకున్న తర్వాత, దానిని ఓడరేవుల నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించడానికి రవాణా ఖర్చులు అవుతాయి. ఢిల్లీ సముద్ర తీరానికి దూరంగా ఉండటం వల్ల, అక్కడికి బంగారాన్ని సురక్షితంగా చేరవేయడానికి రవాణా, ఇన్సూరెన్స్ ఖర్చులు అదనంగా తోడవుతాయి. దీని వల్ల ఇక్కడ రేట్లు ఎక్కువగా ఉంటాయి

4 / 5
ఇక వెండి విషయానికి వస్తే వెండి కూడా బంగారం తరహాలోనే ముందుకెళ్తోంది. గడిచిన రెండ్రోజులతో పోల్చుకుంటే వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,70,000 ఉంది. ఉదయంతో పోల్చుకుంటే ఈ ధర రూ.5000 వేల వరకు తగ్గింది. ఇక దేశీయ మార్కెట్‌లో మాత్రం ఈ ధర రూ.2,60,000 వద్ద కొనసాగుతుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎప్పికప్పుడూ మారుతూ ఉంటాయి. కాబట్టి కచ్చితమైన ధరలు తెలుసుకునేందుకు సమీపంలోని గోల్డ్‌షాప్‌ లేదా సంబంధిత వెబ్‌సైట్‌లను సందర్శించండి

5 / 5
Follow Us