AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండు వెనక అసలు కారణం ఇదే.. కన్నీళ్లు పెట్టిస్తున్న రమణ గోగుల ఎమోషనల్ స్టోరీ

రమణ గోగుల.. తెలుగు ఆడియెన్స్ కు ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయనకు తెలుగులో మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా హుషారైన పాటలకు రమణ గోగుల కేరాఫ్ అడ్రస్. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించారు ఆయన..

గుండు వెనక అసలు కారణం ఇదే.. కన్నీళ్లు పెట్టిస్తున్న రమణ గోగుల ఎమోషనల్ స్టోరీ
Ramana Gogula
Rajeev Rayala
|

Updated on: Apr 23, 2026 | 11:35 AM

Share

సినిమా ఇండస్ట్రీని ఏలిన మ్యూజిక్ డైరెక్టర్స్ లో రమణగోగుల ఒకరు.. ఈ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించారు. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించిన రమణగోగుల.. ఇటీవలే సినిమాలకు గ్యాప్ తీసుకున్నారు. చాలా కాలంగా ఆయన మ్యూజిక్ చేయలేదు. మొన్నామధ్య వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదారి గట్టుమీద రామచిలకవే అనే సాంగ్ పాడారు. ఈ సాంగ్ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. అయితే రమణ గోగుల గుండుతోనే ఎందుకుంటారనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. అది కేవలం ఒక స్టైలో, లేదా జుట్టు లేకపోవడం వల్లో కాదు. దాని వెనుక ఒక తీవ్రమైన భావోద్వేగ కథ ఉంది. సినీ ప్రముఖులు తెరపై ఎలా కనిపించినా, నిజజీవితంలో వారికి కూడా సాధారణ మనుషుల్లనే బాధలు, సెంటిమెంట్లు ఉంటాయి.

ఇది కూడా చదవండి: 60మంది హీరోయిన్స్‌తో నటించిన ఏకైక హీరో.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా టచ్ చేయని రికార్డ్ ఆయనది

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు రమణ గోగుల జీవితంలో కూడా ఇలాంటి ఓ హృదయ స్పందన గల సంఘటన చోటు చేసుకుంది. దాదాపు ఒక దశాబ్దం పాటు తన సంగీతంతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన రమణ గోగుల, తన పాటలతో పాటు తన ప్రత్యేకమైన లుక్‌తోనూ సుపరిచితులు. ఆయన ఎప్పుడూ గుండుతోనే దర్శనమిస్తారు. ఈ గుండు వెనుక భక్తి, తీవ్రమైన  ఎమోషన్స్ తో కూడిన ఒక కారణం ఉందట. జానీ సినిమాకు పని చేస్తున్న సమయంలో, రమణ గోగుల భార్య ప్రెగ్నెంట్‌గా ఉన్నారు. అయితే ఆ సమయంలో డాక్టర్లు ఆమె ఆరోగ్యం బాగలేదని, డెలివరీ చాలా కష్టమని తెలిపారట.

ఇది కూడా చదవండి: రాత్రంతా స్పెషల్ సాంగ్ షూటింగ్.. తెల్లవారితే పెళ్లి..! ఈ హీరోయిన్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

ఈ బాధాకరమైన పరిస్థితుల్లో రమణ గోగుల ఉండగా, తన టీంలోని ఒక సభ్యుడు తిరుపతికి వెళ్లి మొక్కు తీర్చుకోవాలని సూచించాడట. ఆ సలహా మేరకు రమణ గోగుల తిరుపతి వెళ్లి తలనీలాలు సమర్పించారు. ఆశ్చర్యకరంగా, ఆ తర్వాత ఆయన భార్యకు సాధారణ డెలివరీ జరిగింది. ఆ మధుర క్షణంలోనే రమణ గోగుల జీవితాంతం గుండుతోనే ఉండాలని నిర్ణయించుకున్నారట. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా రమణ గోగుల వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: ఇద్దరితో ఎఫైర్, ఇద్దరితో విడాకులు..!ఈ టాలీవుడ్ హీరో మామూలోడు కాదు గురూ..!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us