పాత సామానులతో అద్భుతం.. గ్రామీణ యువతి చేతిలో రూపుదిద్దుకున్న ‘ఎకో వారియర్’ వాహనం!
పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. అసాధ్యం అనుకున్నది కూడా సుసాధ్యం చేయవచ్చు. అందుకు ఉదాహరణే ఈ విద్యార్థిని. తన ప్రతిభతో కుటుంబ సభ్యుల సహకారంతో ఏకో వారియర్ పేరుతో వాహనాన్ని తయారుచేసి అందరి చేత శభాష్ అనిపించుకుంటుంది. తోటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఈ స్ఫూర్తి అనే ఈ యువతి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పర్యావరణహిత వాహనాన్ని తయారు చేసింది స్పూర్తి అనే యువతి. తన తండ్రి ప్రవీణ్ వాహన మెకానిక్. అన్న ఎలక్ట్రీషియన్ కావడంతో చిన్న నాటి నుండి టెక్నాలజీ పట్ల అవగాహన పెంచుకుంది. అంతేకాదు ప్రతి పనిని ఆసక్తిగా గమనిస్తూ బ్యాటరీలతో నడిచే ఏకో వారియర్ వాహనాన్ని తయారు చేసింది. ప్రభుత్వ ఐటీఐలోని ఏటీసీ విద్యను అభ్యసిస్తున్నా స్పూర్తి రాజేందర్ అనే అధ్యాపకుడి ప్రోత్సాహంతో ఎలక్ట్రికల్ వాహనాన్ని తయారు చేసేంది.
పర్యావరణహిత వాహనాన్ని తయారు చేయాలని స్పూర్తి సంకల్పించింది. ప్లాస్టిక్ వ్యర్ధాలను, పాత ఇనుప దుకాణంలోని సామాన్లను సేకరించింది. 40 వేల రూపాయల ఖర్చుతో వాహనాన్ని రూపొందించింది. వాహనం నాలుగు బ్యాటరీలు ఒక మోటర్ ద్వారా నడిచేలా చేసింది. ఏకో వారియర్ అంటూ నామకరణం చేసిన వాహనం రోడ్డుపై రయ్ రయ్ మంటూ పరుగులు పెడుతోంది. ఈ విద్యార్థిని పట్టుదలను చూసి అధ్యాపకులతో పాటు తోటి విద్యార్థులు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు.
వీడియో చూడండి..
ఈ సందర్భంగా స్పూర్తి మాట్లాడుతూ ఎలక్ట్రికల్ వాహనాన్ని తయారు చేయడానికి రెండు నెలలు సమయం పట్టిందనీ, ఆర్థిక స్తోమత లేకపోయిన తన ప్రయత్నానికి అమ్మ నాన్న లతోపాటు అన్నయ్య సహకరించడం మూలంగానే వాహనం తయారు చేయగలిగానని తెలిపారు, ప్రభుత్వం సహకరిస్తే కాలుష్యం లేని మరెన్నో ఎలక్ట్రికల్ వాహనాలను రూపొందిస్తామని చెప్తున్నారు స్ఫూర్తి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..