AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనుషుల్లో మహానుభావుడురా వీడు.. కాటేసే పామునే కాపాడాడు.. ఎక్కడంటే?

పాము కనిపిస్తే చాలు ఆమడ దూరంలో ఉంటాం. అంతటితో ఆగం కదా.. రాళ్లతోనో కర్రలతోనో కొట్టి చంపేస్తారు. అవి కూడా మనలాగే ఒక జీవి అన్న విషయమే మరిచిపోతాం. వాటికి కూడా భూమి మీద స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందని అస్సలు అనుకోం. కానీ వన్యప్రాణులు, మూగ జీవాలపై కేవలం అతికొద్ది మందికి మాత్రమే ప్రేమ ఉంటుంది. అలాంటి ఓ వ్యక్తి సరీసృపాన్ని కాపాడేందుకు ఏం చేశాడో తెలుసా..?

మనుషుల్లో మహానుభావుడురా వీడు.. కాటేసే పామునే కాపాడాడు.. ఎక్కడంటే?
Treatment To Snake
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Jul 05, 2025 | 12:46 PM

Share

పాము కనిపిస్తే చాలు ఆమడ దూరంలో ఉంటాం. అంతటితో ఆగం కదా.. రాళ్లతోనో కర్రలతోనో కొట్టి చంపేస్తారు. అవి కూడా మనలాగే ఒక జీవి అన్న విషయమే మరిచిపోతాం. వాటికి కూడా భూమి మీద స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందని అస్సలు అనుకోం. కానీ వన్యప్రాణులు, మూగ జీవాలపై కేవలం అతికొద్ది మందికి మాత్రమే ప్రేమ ఉంటుంది. అలాంటి ఓ వ్యక్తి సరీసృపాన్ని కాపాడేందుకు ఏం చేశాడో తెలుసా..?

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట సమీపంలోని లింగోటం గ్రామ సమీపంలో ఓ పౌల్ట్రీ ఫాం ఉంది. అయితే శుక్రవారం(జూలై 04) మధ్యాహం సమయంలో పౌల్ట్రీ ఫాం ఆవరణలోని గడ్డి పొదల్లో ఏదో కదలికను యజమాని గమనించాడు. కాసేపటికీ.. అక్కడి నుంచి ఓ పాము వెళ్లడాన్ని గమనించాడు. దీంతో విషయాన్ని అచ్చంపేటలో స్నేక్ క్యాచర్‌గా పేరుగాంచిన సుమన్‌కు సమాచారం ఇచ్చారు. ఇక పౌల్ట్రీ ఫాం వద్దకు చేరుకున్న సుమన్ అక్కడ సంచరిస్తున్న పామును జెర్రిపోతుగా గుర్తించాడు. దానిని పట్టుకొని సమీప అడవిలో వదలాలని భావించాడు.

అయితే పాముని పట్టుకోగానే గాయమైనట్లు గుర్తించి స్థానిక వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు. పామును పరిశీలించిన డాక్టర్ హరీశ్.. గాయమైన చోట చికిత్స చేశాడు. ఐరన్ వైర్ గీసుకుపోవడంతో పాముకు గాయం అయినట్లు గుర్తించారు. కొంత పాము చర్మం సైతం ఊడినట్లు గుర్తించి, సరైన చికిత్స అందించారు డాక్టర్ హరీశ్. అనంతరం గాయపడిన పామును లింగోటం సమీపంలోని అడవిలో విడిచిపెట్టాడు స్నేకర్ సుమన్.

వీడియో చూడండి.. 

ఇక గాయపడిన పామును కాపాడేందుకు స్నేక్ క్యాచర్ సుమన్ తీసుకున్న చొరవ పట్ల అచ్చంపేట, లింగోటం ప్రజలు అభినందనలు తెలిపారు. సుమన్ ప్రస్తుతం విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఖాళీ సమయాల్లో స్నేక్ రెస్క్యూ చేస్తూ ఉంటాడు. ఇప్పటికే పాము కాటు నుండి అనేక మంది ప్రాణాలను కాపాడారు సుమన్. అలాగే వేలాది పాములను సైతం మానవుల దాడి నుంచి రక్షించాడు. పాము ఉందని కాల్ చేస్తే చాలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా అక్కడ వాలిపోతాడు స్నేక్ క్యాచర్ సుమన్.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్