Hyderabad: సరదా పడ్డ భర్తకు చుక్కలు చూపించిన భార్య.. ఏకంగా ఆసుపత్రిపాలైన భర్త !
సరదా పడ్డ భర్తకు చుక్కలు చూపించిందో భార్య. ఈ ఘటన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వెలుగు చూసింది. స్నానం చేసే సమయంలో వీపు తోమాలని భార్యపై గట్టిగా కేకలు వేశాడు ఓ భర్త. అంతే ఆమెకు చిర్రెత్తుకొచ్చింది.
సరదా పడ్డ భర్తకు చుక్కలు చూపించిందో భార్య. ఈ ఘటన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వెలుగు చూసింది. స్నానం చేసే సమయంలో వీపు తోమాలని భార్యపై గట్టిగా కేకలు వేశాడు ఓ భర్త. అంతే ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. క్షణికావేశంలో ఐరన్ రాడ్ తో భర్త తలపై గట్టిగా ఒక్కటిచ్చింది. దీంతో దెబ్బ తల పగిలి ఆసుపత్రిపాలయ్యాడు. ఈ ఘటన కేపి.హెచ్.బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
నల్లగొండ జిల్లాకు చెందిన శివ తన భార్య పిల్లలతో కలిసి కేపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఉదయం శివ స్నానం చేసే సమయంలో వీపు తోమాలని భార్యపై గట్టిగా కేకలు వేశాడు. చుట్టుపక్కల వారు వింటే బాగోదని భార్య చెప్పడంతో, ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య గొడవ పెద్దదవడంతో భార్యాభర్తల మధ్య పెనుగులాట జరిగింది. దీంతో భార్య అక్కడే ఉన్న ఐరన్ రాడ్‌తో భర్త తలపై కొట్టింది. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతన్ని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఐరన్ రాడ్ తో తలపై బలంగా గాయపరచడంతో భర్తకు బలమైన గాయాలు అయ్యాయి. ఈ ఘటన పైన భర్త శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇంత చిన్న విషయంలో భార్య క్షణికావేశానికి గురి కావడం పట్ల స్థానికులు మందలించారు. భర్తకు మాటలతో నచ్చజెప్పే విషయంలో ఐరన్ రాడ్ తో చితక బాధటం ఏంటని నిలదీశారు. ఏదైనా జరిగితే భర్త ప్రాణాలు పోయేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..