Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కదిలించే జ్ఞాపకం.. తమ్ముడికి ప్రేమతో.. నిలువెత్తు విగ్రహం పెట్టిన తోబుట్టువులు

అన్యోన్యంగా ఉంటున్న ఇద్దరు అన్నదమ్ముల అనుబంధంపై కాలం కన్నుకుట్టింది. అకస్మాత్తుగా తమ్ముడిని గుండె సమస్య కబళించి అన్నకు దూరం చేసింది. తమ్ముడు గతించడంతో మనోవేదన కు గురైన అన్న మనసు తల్లడిల్లింది, తమ్ముడితో ఉన్న తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఏడాది గడిపాడు. ఎలాగైనా తమ్ముడితో ఉన్న అనుబంధానికి గుర్తుగా ఏదైనా చేయాలని ఆలోచించి గ్రామ నడిబొడ్డున విగ్రహం పెట్టాలని నిర్ణయించుకున్నాడు.

కదిలించే జ్ఞాపకం.. తమ్ముడికి ప్రేమతో.. నిలువెత్తు విగ్రహం పెట్టిన తోబుట్టువులు
Brother Statue
Follow us
M Revan Reddy

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 04, 2023 | 9:49 AM

చనిపోయిన ఆత్మీయులను స్మరిస్తూ వారితో ఉన్న అనుబంధానికి గుర్తుగా గుళ్ళు కట్టడం, విగ్రహాలు ఏర్పాటు చేయడం సాధారణంగా చూస్తూ ఉంటాం . అందులో ఎక్కువగా తల్లిదండ్రులు, కట్టుకున్న భార్యకో.. భర్తకో లేక కడుపున పుట్టిన వారి కోసం గుడి కట్టడాన్ని, విగ్రహాన్ని పెట్టడం కామన్ గా కనిపిస్తుంది. కానీ, తోబుట్టువు తమ్ముడిని తలచుకుంటూ అన్న విగ్రహం పెట్టడం ఎక్కడా కనిపించదు. అన్నదమ్ములంటే ఆస్తి తగాదానో.. లేక పొలం పంచాయతీ పెట్టుకుని ఎడమోహం పెడమోహంగా ఉండే నేటి రోజుల్లో అందుకు భిన్నంగా గతించిన తమ్ముడిపై మమకారంతో ఏకంగా తన సోదర ప్రేమను చాటుతూ తమ్ముడికి విగ్రహం పెట్టాడో అన్న. తమ్ముడి కోసం తపిస్తూ అతనిపై ఉన్న వాత్సల్యం.. చిరకాలం గుర్తు ఉండేలా గ్రామ నడిబొడ్డున విగ్రహం ఏర్పాటు చేసి ఘనంగా నివాళులు అర్పించాడు. వివరాల్లోకి వెళ్తే…

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ( s ) మండలం బొప్పారం గ్రామానికి చెందిన గోపగాని లక్మి నారాయణ, ప్రమీల దంపతులకు ముగురు సంతానం. కుమార్తె వెంకట రమణ తరవాత కుమారులు రమణ మూర్తి, రామకృష్ణలు జన్మించారు. అన్నదమ్ములిద్దరూ బలరామకృష్ణులను తలపిస్తూ ప్రేమతో కలిసి పెరిగారు. ప్రేమ ఆత్మీయతల కలగోపుగా కష్టసుఖాలను పంచుకుంటూ అన్యోన్యంగా పెరిగారు. అన్న రమణ మూర్తి న్యాయవాదిగా స్థిరపడగా, తమ్ముడు రామకృష్ణ ప్రజా సేవ చేయాలనే తలంపుతో రాజకీయాల్లో అడుగుపెట్టి గ్రామ సర్పంచ్ గా రెండు సార్లు ఎన్నికైయ్యాడు. నిబద్దతగా పనిచేస్తూ గ్రామ అభివృద్దికి ఎనలేని కృషి చేసి ప్రజల మన్ననలు పొంది మంచి నాయకుడిగా గుర్తింపు పొందాడు. అన్యోన్యంగా ఉంటున్న ఇద్దరు అన్నదమ్ముల అనుబంధంపై కాలం కన్నుకుట్టింది. అకస్మాత్తుగా తమ్ముడిని గుండె సమస్య కబళించి అన్నకు దూరం చేసింది. తమ్ముడు గతించడంతో మనోవేదన కు గురైన అన్న మనసు తల్లడిల్లింది, తమ్ముడితో ఉన్న తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఏడాది గడిపాడు. ఎలాగైనా తమ్ముడితో ఉన్న అనుబంధానికి గుర్తుగా ఏదైనా చేయాలని ఆలోచించి గ్రామ నడిబొడ్డున విగ్రహం పెట్టాలని నిర్ణయించుకున్నాడు.

అనుకున్నదే తడవుగా సొంత ఖర్చులతో తమ్ముడు రామకృష్ణ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని తయారు చేయించి మొదటి వర్ధంతి రోజున ఊరి మధ్యలో నెలకొల్పాడు. గ్రామ ప్రజలు, బంధువులు వెంటరాగా ఘనంగా పండుగ వాతావరణం నడుమ తమ్ముడి కాంస్య విగ్రహం ప్రారంభించాడు. ఇద్దరి పేగు బంధం ఎంత గొప్పదో.. తమ్ముడితో ఉన్న జ్ఞాపకాలను స్మరించుకున్నాడు. బాధాతప్త హృదయంతో తమ్ముడి ఆశయ సాధనకు కృషి చేస్తానని.. గారాల తమ్ముడిపై ప్రేమను చాటుకున్నాడు అన్న రమణ మూర్తి. కక్షలు, కార్పణ్యాలతో కొట్టుకునే అన్నదమ్ముల్లా కాకుండా ప్రేమానురాగాలకు ప్రతి రూపాలుగా నిలిచిన అన్నదమ్ముల వాత్సల్యంపై గ్రామస్థులు ప్రశంసలు కురిపించారు. మీ అన్నదమ్ముల ప్రేమ అజరామరంగా నిలిచిపోవాలని నిండు మనసుతో దీవించారు గ్రామస్థులు, బంధుగణం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..