AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Building Collapse : మూడంత‌స్తుల భ‌వ‌నం..పేక‌మేడ‌లా కూలింది.. శిథిలాల కింద చిక్కుకుపోయిన ప‌లువురు

శిథిలాల కింద చిక్కుకుని రక్షించిన సహాయక సిబ్బంది హుటహుటినా వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా, వారిలో ఇద్దరు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఎనిమిది మందిని సమీప పెద్ద ఆసుపత్రికి రిఫర్ చేశారు. శిథిలాలలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ప్రయత్నిస్తున్నాయి.

Building Collapse : మూడంత‌స్తుల భ‌వ‌నం..పేక‌మేడ‌లా కూలింది.. శిథిలాల కింద చిక్కుకుపోయిన ప‌లువురు
Building Collapsed
Jyothi Gadda
|

Updated on: Sep 04, 2023 | 9:20 AM

Share

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటన జరిగినప్పుడు భవనంలోని వారంతా గాఢ నిద్రలో ఉన్నారు. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంతో శిథిలాల కింద పడి ఇద్దరు మృతి చెందినట్టుగా తెలిసింది.. ఇంకా చాలా మంది భవనం శిథిలాల కిందే చిక్కుకుపోయినట్టుగా తెలుస్తుంది. కాగా, శిథిలాల్లో చిక్కుకుపోయిన మరో 12 మందిని రక్షించారు. ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. బిల్డింగ్ కూలిన ప్రమాదం తర్వాత, ఎస్పీ దినేష్ కుమార్ సింగ్, CDO ఏక్తా సింగ్, ADM అరుణ్ కుమార్ సింగ్ సమక్షంలో పోలీసులు, SDRF స్థానిక ప్రజలు సహాయక చర్యలు ప్రారంభించారు.

శిథిలాల కింద చిక్కుకుని రక్షించిన సహాయక సిబ్బంది హుటహుటినా వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా, వారిలో ఇద్దరు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఎనిమిది మందిని లక్నోకు రిఫర్ చేశారు. శిథిలాలలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ప్రయత్నిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఫతేపూర్ పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న మొహల్లా కాజీపూర్ వార్డు 2లో హషీమ్ అనే వ్య‌క్తికి చెందిన మూడంతస్తుల ఇల్లు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పూర్తిగా కూలిపోయింది.  సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పూర్తిగా కుప్పకూలింది. ఆకస్మిక ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, పోలీసు బలగాలతో పాటు అధికారులందరూ, పలు పోలీసు స్టేషన్ల SDRF బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. సుమారు రెండు గంటల పాటు శ్రమించి శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో హషీం కుమార్తె రోష్ని (22), హకీముద్దీన్ (25) కుమారుడు ఇస్లాముద్దీన్ మృతి చెందారు. కాగా హషీం భార్య షకీలా (55), కుమార్తెలు జైనాబ్ (10), మెహక్ (12), కుమారులు సమీర్ (18), సల్మాన్ (25), సుల్తాన్ (28), జఫరుల్ హసన్ (35), కుమారుడు ఇస్లాముద్దీన్, అతని తల్లి ఉమ్ కుల్సుమ్ (60) తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారందరినీ జిల్లా ఆసుపత్రి నుండి లక్నోకు తరలించారు. వారిలో ఇస్లాముద్దీన్ హషీం పొరుగువారు కూడా ఉన్నారు. అతని కుటుంబం ఇంటి ఆరుబయట నిద్రిస్తున్నట్టుగా తెలిసింది. భవనం కూలిపోవడంతో శిధిలాల వల్ల గాయపడ్డారు. శిథిలాల కింద మరో ఇద్దరు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు.

ఈ ఘటన తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగిందని ఎస్పీ బారాబంకి దినేష్ సింగ్ తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే రెస్క్యూ ప్రారంభమైంది. లక్నో నుండి SDRF బృందం చేరుకుంది, 12 మందిని జిల్లా ఆసుపత్రికి పంపారు, అందులో ఇద్దరు మరణించారు, ఇతర తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం లక్నోలోని ట్రామా సెంటర్‌కు రిఫర్ చేశారు. . ప్రస్తుతం ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నట్లు సమాచారం ఉందన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.